అదృశ్య రూపంలో ఆర్థిక సహాయం.. దళిత దివ్యాంగుని వాస్తవ కదనానికి చలించిన హృదయం..

పిఠాపురం నియోజకవర్గం, నర్సింగపురం గ్రామం నందు గుడాల నాగేశ్వరరావు తండ్రి లేని నిరుపేద దళిత యువకుడు. 8 సంవత్సరాల కాలంలో తన జీవితంలో జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాద దుర్ఘటణల కారణంగా పొందుతున్న వ్యదకు అక్షర రూపాన్ని ఇస్తూ సోషల్ మీడియా వేదికగా పలు కథనాలని కొన్ని రోజులుగా జనసైనికులు ప్రచురించడం జరిగినది. ప్రతి స్పందనగా అనేకులు సహాయం అందిస్తూ ముందుకు రావడం జనతా ఫౌండేషన్ ద్వారా వైద్య ఖర్చులకు జమ్ము సహాయాన్ని అందించడం జరిగింది. వాటిని మరలా సోషల్ మీడియా నందు ప్రచురితం చేయగా వాటిని చూసిన ఒక మంచి మనసున్న మహోన్నత హృదయం ఒక సంవత్సరం పాటు ప్రతి నెల 1500 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని ఒక సంవత్సరం పాటు అందిస్తానని ముందుకు రావడం జరిగింది. ఈ అదృశ్య సహాయం ఆ యువకునికి వైద్య ప్రయాణ ఖర్చులకు, నిత్యవసరమునకు ఉపయోగపడుతూ తాను రికవరీ అయ్యే కాలం వరకు ఒక ఆర్థిక భరోసాగా నిలుస్తుంది. శుక్రవారం సాయంత్రం మొదటి విడత సహాయాన్ని గుడాల నాగేశ్వరరావు బ్యాంక్ అకౌంట్ కి సదరు మానవతా మూర్తి అందివ్వడం జరిగినది. సహాయానికి పేరు తెలపడం అవసరం లేదని తన వివరాలు తెలపడానికి ఇష్టపడని మానవతామూర్తికి పిఠాపురం నియోజకవర్గ జనసైనికులు తరఫున కృతజ్ఞతలు తెలియజేసారు.