నాదెళ్ల జనసేన సీనియర్ నాయకుల మర్యాదపూర్వక భేటీ

  • రైల్వేకోడూరు కార్యకర్తల కార్యక్రమానికి విచ్చేసిన నాదెళ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన సీనియర్ నాయకులు

రైల్వే కోడూరు నియోజకవర్గం: రైల్వే కోడూరు జనసేన కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన నాదెళ్ల మనోహర్ ను రైల్వే కోడూరులో పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు పని చేస్తున్న సీనియర్ నాయకులు కలవడం జరిగింది. కడప జిల్లాలో మొదటిగా గెలవబోయే కోడూరు జనసేన ఎమ్మెల్యే సీటు కోసం మరింతగా కష్టపడాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వారికి కచ్చితంగా పార్టీ తరపున న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారందరిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. రాబోయే రోజుల్లో జనసేన గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడూరు జనసేన సీనియర్ నాయకులు జోగినేని మని,
మర్రి రెడ్డి ప్రసాద్, వర్ధన గారి ప్రసాద్, ముత్యాల కిషోర్, ఉత్తరాది శివకుమార్, అంకి శెట్టి మనీ, కొండేటి వెంకటరమణ, లింగాలహరి, నగిరిపాటి మహేష్, పాల్గొన్నారు.