పాకుల రిజర్వాయర్ భూనిర్వాసితుల రిలే నిరాహారదీక్షకు జనసేన మద్దతు

వనపర్తి జిల్లా, రేవల్లీ మండలం, బండరాయి పాకుల రిజర్వాయర్ ముంపుకు గురైన గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షకు జనసేన పార్టీ మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు శనివారం గ్రామస్థుల రిలే దీక్షకు మద్దతుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు, వనపర్తి నియోజకవర్గ నాయకులు ఎమ్ రెడ్డి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతుల పక్షాన ఎప్పుడూ జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకొని మరణించిన రైతుల కుటుంబాలకు తమ కష్టార్జితం 30 కోట్లు అందిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామస్థులపై స్పందించి వారికి న్యాయం చేయకపోతే జనసేన ఎప్పుడూ ఈ గ్రామస్థుల తరపున ఎంతటి పొరటానికైన సిద్ధంగా ఉంటుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ నాయకులు విజయ్, కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు.