ఝాన్సీ లక్ష్మీబాయికి పిఠాపురం జనసేన వీరమహిళల ఘననివాళులు

  • జనసేన వీర మహిళలతో పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించబడిన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ జయంతోత్సవ వేడుకలు

పిఠాపురం నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం, ఉభయగోదావరి జిల్లాల జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఆహ్వానం మేరకు పిఠాపురం పట్టణంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి శిరీష ఆధ్వర్యంలో, నియోజకవర్గ జనసేన నాయకులు ఊట ఆదివిష్ణు (నాని బాబు) సమక్షంలో నియోజకవర్గ వీర మహిళలలతో అత్యంత ఘనంగా ఝాన్సీ రాణి లక్ష్మీ బాయి జయంతోత్సవాలను నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి పోరాటపటిమను గుర్తు చేస్తూ అతివలు ఆత్మవిశ్వాసంతో ఈ సమాజంలో ఏర్పడుతున్న సంఘర్షణను అధిగమించి అందరికీ ఆదర్శంగా నిలవాలని తోలేటి శిరీష వ్యాఖ్యానించారు. నియోజవర్గ జనసేన నాయకులు ఊట నానిబాబు మాట్లాడుతూ జనసేన వీరమహిళలు అబలలు కాదని నరనరాన పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని నింపుకున్న శార్దూల వాహినులు అని అధికార మదాంధకారంతో పరిహాసం చేసేవారికి తగిన గుణపాఠం చెప్పి రాబోయే జనరల్ ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని సీఎం చేసే విప్లవ జ్యోతులు వీరేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 50 మంది నియోజకవర్గ వీర మహిళలతో పాటుగా గంజి గోవిందరాజు, బర్రా విజయ్ పాల్గొని ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కీర్తి.. జనసేన వీర మహిళలకు స్ఫూర్తి.. అని నినాదాలు ఇస్తూ వీరనానికి ఘనమైన నివాళులు అర్పించారు.