దళిత దివ్యాంగుని వైద్యానికి ఆర్థిక సహాయం అందించిన జనతా ఫౌండేషన్

పిఠాపురం నియోజకవర్గం: నరసింగపురం గ్రామానికి చెందిన నిరుపేద అయిన గుడాల నాగేశ్వరరావు (32), అనే తండ్రి లేని దళిత యువకుడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో కాలుని కోల్పోయి ఆర్టిఫిషియల్ లెగ్ తో, విరిగిపోయిన చేతికి ఐరన్ ప్లేట్స్ తో, జీవితాన్ని అతి కష్టంగా కొనసాగిస్తున్నాడు. దురదృష్టాన్ని వీడని అతని జీవితం కొంతకాలం క్రితం మరొకసారి యాక్సిడెంట్ జరగడంతో ఐరన్ ప్లేట్స్ ధరించిన చేయి మరొక్కసారి విరిగిపోయింది. దీనితో అత్యంత సున్నితంగా మారిన చేతి ఎముక పరిస్థితి అత్యంత ఆధునిక వైద్యం అందిస్తూ మూడు నెలలు ఎముక ఎదుగుదలకు సంబంధించిన ఇంజక్షన్స్ కోర్సుగా తీసుకోవలసిన పరిస్థితిలో నిరుపేద అయిన గుడాల నాగేశ్వరరావు దుస్థితి తెలుసుకున్న గ్రామ జనసైనికులు జనసేన పార్టీలో పలువురి పెద్దలకు సమాచారం చేరవేయగా గొల్లప్రోలు మండల జనసేన నాయకులు మర్రి దొరబాబు స్పందిస్తూ తన స్నేహితుడైన జనతా ఫౌండేషన్ ఫౌండర్ జమ్ము కి విషయం తెలియజేశారు.
జమ్ము రెండు రోజుల క్రితం నరసింగపురం గ్రామం చేరుకుని బాధితుడ్ని దుస్థితి స్వయాన పరీక్షించి తను ఆర్గనైజింగ్ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ జనతా ఫౌండేషన్ ద్వారా నేడు రెండు నెలల ట్రీట్మెంట్ కోర్స్ కి సరిపడే ఆర్థిక సహాయంగా 15 వేల రూపాయల నగదును గ్రామ జనసైనికుల సమక్షంలో అందించడం జరిగినది. తక్షణం స్పందించిన జనతా పౌండర్ జమ్మూ కు, మర్రి దొరబాబు కు నరసింగపురం జనసైనికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంజి గోవిందరాజు, ధూళిపూడి శ్రీధర్, సువర్ణం మణికంఠ, కేశవరపు సుబ్బు, మేడిశెట్టి సింహాద్రి తదితర జనసేన నాయకులు సైనికులు పాల్గొన్నారు.