అమలాపురంలో వికలాంగుల పింఛన్ల పరిశీలన

అమలాపురం: 9వ వార్డులో వికలాంగుల పింఛన్ల పరిశీలన అమలాపురం పురపాలకసంఘ పరిధి 9వ వార్డ్ సచివాలయంలో వికలాంగులకు ఇచ్చే పింఛన్ పరిశీలన కార్యక్రమం జరిగింది. ఇంటినుండి రాలేని వారికి వారి ఇంటివద్దనే పరిశీలన చేసారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి, పురపాలక ఏ.ఈ.హేమంత్, సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ గణేష్, జనసేన నాయకుడు గొలకోటి వాసు పాల్గొన్నారు.