ప్రజా సమస్యలను పరిష్కరించాలి.. కలెక్టర్ కు జనసేన వినతి పత్రం

అద్వాన్నంగా ఉన్న రోడ్లను నిర్మించాలని కలెక్టర్ కు జనసేన వినతి పత్రం

రాయచోటి: అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి తమ్మిమ్ అన్ శరీ ను సోమవారం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ కలసి పలు ప్రజా సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అలానే ఒక సారి విజిట్ కూడా చేస్తాము అని హామీ ఇచ్చారు. ఆమెను జనసేన పార్టీ తరపున రామశ్రీనివాస్ అభినందించారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మరియు టి.సుండుపల్లె మండల పరిదిలో ఈ క్రింద కనపరచిన రోడ్లు చాలా అద్వాన్నంగా వున్నాయి దీని వలన వాహనదారులు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా అనేక ప్రమాదాలు కూడా జరుగుచున్నవి దీని వలన ప్రాణనష్టం కూడా జరిగే అవకాశం కలదు.

1) టి.సుండుపల్లె నుండి రాయవరం పోవు రహదారిలో బౌరవగట్ట సమీపమున పెట్రోల్ బంక్వద్ద వర్షానికి నీళ్ళు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఈ దారిగుండా ఏ వాహనము పోవాలన్నా చాలా ఇబ్బందులు పడుచున్నారు.

2) టి.సుండుపల్లె నుండి రాయవరం వరకు కూడా రోడ్డు చాలావరకు దెబ్బతిన్నది రోడ్లుంతా గుంతమయం అయిపోయినాయి దీనవలన వాహనదారులు అనేక ఇబ్బందులు పడుచున్నారు.

3) టి.సుండుపల్లె నుండి ఫించా పోవు దారిలో చెరుకువాండ్లపల్లె సమీపాన నాగారపమ్మ గుడివద్ద అయ్యవారిచెర్వుకు సంబందించిన వంతెన దెబ్బతిని రోడ్డు పూర్తిగా కొట్టుకొనిపోయి రోడ్డుపైన గుంతలు ఏర్పడి వాహనదారులకు చాలా ఇబ్బందులు కలుగుచున్నది అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా వున్నది.

4) బెస్తపల్లె నాగారపమ్మ గుడి ఆర్చినుండి ఈడిగపల్లె మీదుగా కొత్తపల్లె వరకు రోడ్డు నిర్మాణ పనులు మద్యలో నిలిపివేయడం వలన రోడ్డుపైన వున్న కంకర రాళ్ళు వలన వాహనదారులు ప్రమాదాలకు గురై అనేక ఇబ్బందులు పడుచున్నారు.

5) తిమ్మసముద్రం నుండి వయా బెస్తపల్లె మీదుగా ఫించాకు పోవు రహదారిలో ఓబులేసు గుట్టవద్ద చిట్టేడు వంతెనె కొట్టుకొనిపోయినది అప్పుడు తాత్కాలికంగా మట్టితోలి రోడ్డును పునరుద్ధరించారు కానీ ఇటీవలన కురిసిన వర్షాలకు మట్టికొట్టుకొనిపోయి దారి అద్వాన్నంగా తయారైనది దీనవలన చుట్టు ప్రక్కల గ్రామ ప్రజలు రాకపోకలకు అనేక ఇబ్బందులు పడుచున్నారు.

6) రాయచోటి నుండి తిమ్మసముద్రము, ఫించా బస్సు సౌకర్యము ఇదివరలో వుండినది. 3 సంవత్సరముల క్రితం వంతెను కొట్టుకొనిపోయినందున సదరు బస్సును నిలిపివేసినారు. దీని వలన 12 గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యము లేక స్కూల్కు వెళ్ళే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున బస్సును పునరుద్దరించాలని కోరుచున్నాము.

7) టి.సుండుపల్లె పంచాయతి అగ్రహారం నుంచి యేటిగడ్డ రాచపల్లె, పెద్ద బలిజపల్లె మీదుగా సామిసేనిగడ్డ హరిజనవాడ వరకు రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుచున్నారు. సదరు రోడ్డు టెండర్లు జరిగి టెండర్ దక్కించుకొన్నవారు రోడ్డు వేయకుండా నిలుపుదల చేసియున్నారు.

పైన తెలిపిన విధంగా అన్నమయ్య జల్లా మొత్తం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చాలా అధ్వాన్నంగా వున్నాయి దీని వలన స్కూలు పిల్లలు సకాలంలో స్కూళ్ళకు వెళ్ళలేక, పేషెంట్లు, వృద్ధులు, గర్భిణీలు సకాలంలో హస్పటల్కు పోలేక ఇలా అనేకమంది ప్రజలు చాలా ఇబ్బందులుపడుచున్నారు. కావున తమరు వెంటనే ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించవలసినదిగా కోరుచున్నానని జనసేన పార్టీ నాయకులు అన్నమయ్య జిల్లా..కోఆర్డినేటర్ రామ శ్రీనివాస్ కోరారు, ఈ కార్యక్రమంలో రాయచోటి అసంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ షేక్ హసన్ భాష, జిల్లా కార్యక్రమాల సభ్యుడు షేక్ రియాజ్, జిల్లా జనసేన దూదేకుల సంగం అధ్యక్షుడు మస్తాన్, రాయచోటి యువనాయకులు నవీన్ రాయల్, మదన్ కుమార్, మైనారిటీ నాయకులు రషీద్ మౌలానా, జనసైనికులు అరిఫ్, మహ్మద్ కైఫ్, ముశ్రీఫ్, మహ్మద్ ఫుజేర్ తదితరులు పాల్గొన్నారు.