ఉంగుటూరు ఎమ్మార్వోకి జనసేన వినతిపత్రం

ఉంగుటూరు, రాష్ట్రంలో రైతులు ఆరుగలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలంటే అధికారుల చుట్టు ప్రదక్షిణ చేయవలసి వస్తుందని జనసేన పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ ఇన్చార్జి పత్సమట్ల ధర్మరాజు పేర్కోన్నారు. రైతు భరోసా కేంద్రాల చుట్టూ విఆర్వోల చుట్టూ సంచుల కోసం తిరగవలసి వస్తుందని. మరో పక్క వాతావరణం అనుకులంగా లేకుండా వర్షపు జల్లులు పడుతూ రైతులను మరింత ఆంధోళనకు గురిచేస్తున్నాయి పండిన పంటను వర్షపు భారినుండి కాపాడుకోవడం కోసం చేల గట్లపైన బరకాలు వేసి నిల్వ ఉంచుకుంటున్నారు. సార్వా ధాన్యం అమ్మిన వెంటనే రైతులకు డబ్బులు రాకపోగా
• వర్ష ప్రభావం వల్ల తేమశాతం (మాయిశ్చర్) నిబంధన లేకుండా ధాన్యం సేకరించాలి.
• ధాన్యానికి సంచులు మరియు రవాణా సౌకర్యం వెంటనే కల్పించాలి.
• ఆన్లైన్ పనిచేయకపోయినా రైతుల దగ్గర విజ్ఞప్తి స్వీకరించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
• రైతులకి దగ్గరలో ఉన్న మిల్లులకే ధాన్యం కేటాయించాలి.
• రైతుల దగ్గర ధాన్యం తెసుకొన్న వెంటనే కొంత నగధు రైతులకు అంధచేయాలి
• మిల్లుల వద్ద ధాన్యం త్వరగా దిగుమతి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి.
• ధాన్యం సేకరణలో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి
రైతు కన్నీళ్లు రాష్ట్రానికి మంచిది కాదని నియోజకవర్గ కేంద్రమైన ఉంగుటూరులోని ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ రైతులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.