జ్యోతిరావు పూలేకు ఘననివాళులు అర్పించిన గురజాల జనసేన

గురజాల: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్బంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జ్యోతి రావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా ఘననివాళులు అర్పించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గారు అంటరాని తనంపై, అనేక పోరాటాలు చేశారని, అంతేకాకుండా సమాజంలో ప్రతి ఒక్కరిలో విద్య ద్వారా మాత్రమే చైతన్యం వస్తుందని భావించి స్త్రీ విద్యను ప్రోత్సహించి మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించిన గొప్ప వ్యక్తి జ్యోతి రావు పూలే గారు అని ఆయన చేసిన త్యాగం, మరువరానిది అని అన్నారు, ఇప్పటి వరకు మన రాష్టాన్ని పాలించిన నాయకులు సంక్షేమ పథకాలకు తమ పేర్లు తమ కుటుంబ వ్యక్తుల పేర్లు పెట్టుకుంటున్నారు. తప్ప స్వాతంత్ర సమరయోధుల పేర్లు ఎక్కడా ఎవ్వరూ పెట్టడం లేదు అని పవన్ కళ్యాణ్ అనేక సందర్బాలలో చెప్పినట్టు నిజంగా వీళ్లపై చిత్తసుద్ది ఉంటే వీరి పేర్లను సంక్షేమ పథకాలకు పెట్టాలని లేని పక్షంలో జనసేన ప్రభుత్వం రాగానే ప్రతియొక్క సంక్షేమ పధకానికి స్వతంత్ర సమర యోధుల పేర్లు పెడతామని అన్నారు. గురజాల నియోజకవర్గం, మాడుగుల గ్రామంలో పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేసే విధంగా మన విద్యా వ్యవస్థను అధికార పక్షాలు తీసుకొచ్చాయని వెంటనే స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి స్పందించి అక్కడ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల ఖాసీం సైదా, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దూదేకుల సలీం, మండల ఉపాధ్యక్షులు పెదకొలిమి కిరణ్, బయ్యవరపు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి షేక్ మదీనా, అంబటి సాయి, గుర్రం గోపి తదితరులు పాల్గొన్నారు.