గరుత్మంతుల వారిని అవమానించిన వారిపై ఫిర్యాదు చేసిన జనసైనికులు

తిరుపతి: రామదూత స్వామి 2023 క్యాలెండరు ను ఎపి రోడ్డు రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా తిరుపతిలో ఆవిష్కరించారు. ఈ కాలమాన పట్టికలో సాక్షాత్తు ఆ దేవదేవుడు శ్రీవారి వాహనం గరుత్మంతుడిని రామదూత స్వామి పాదాల వద్ద ఉండేలా ప్రచురిత మై ఉన్న క్యాలెండర్ శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయంటూ జనసేన పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, ఆకేపాటీ సుభాషిని, హేమ కుమార్, కొండా రాజమోహన్, సుమన్ బాబు, మునస్వామి, కిషోర్, విజయ రెడ్డి, లక్ష్మి, నవ్య రెడ్డి, సుమన్, మణి, రాజేష్ ఆచారి, రాజేష్, కాకర్ల హేమంత్, సాయి కుమార్, వెంకటేష్, దిలీప్ రాయల్, తదితరులు మంగళవారం ఈ ఘటనపై టిటిడి అధికారులు వెంటనే స్పందించాలని అలిపిరి పోలీస్ స్టేషన్లో రామదూత స్వామి సంబంధిత వారిపై ఫిర్యాదు చేసి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.