నాగబాబుతో నంద్యాల జనసేన నాయకుల మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్: గురువారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబును నంద్యాల జనసేన నాయకులు చందు, సుందర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామస్థాయిలో, వార్డు స్థాయిలో జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తున్నాం, ఏ విధంగా చేయాలనుకుంటున్నాం, సమస్యల మీద ఎలా పోరాడుతున్నాం, ఏలా పోరాడాలనుకుంటున్నాం ప్రతి విషయం నాగబాబుతో చర్చించడం జరిగింది. ఆయన ఎంతో ఓపికతో ప్రతి విషయం విని ఏ విధంగా ముందుకు పోవాలో దిశా నిర్దేశం చేయడం జరిగింది. నంద్యాల జనసేన పార్టీ తరఫున కొణిదెల నాగబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయదం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసైనికులు ఫక్రుద్దీన్, ఫారూఖ్, ఫ్రాన్సిస్ సుంకన్న హాజరయ్యారు.