సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ ని సందర్శించిన బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి: వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ ని శుక్రవారం రాత్రి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సందర్శించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గత రెండు రోజులు క్రితం ప్రధాన పత్రికలలో ప్రింట్ వచ్చినటువంటి కథనం మేరకు హాస్టల్ ను పరిశీలించడం జరిగింది. హాస్టల్ లో కేవలం నలుగురే నలుగురు విద్యార్థులు ఉంటున్నారు. వారికి సరైన వసతులు లేవని, అదేవిధంగా వాళ్లకి భోజనం మెనూ ప్రకారం సరిగ్గా అందడం లేదని, తాగడానికి నీళ్లకు కూడా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ప్రధాన పత్రికలలో రావడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే శుక్రవారం రాత్రి జనసేన కార్యకర్తలతో వెళ్లి హాస్టల్ ను సందర్శించి, నలుగురు పిల్లలని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడైతే పూర్తిస్థాయిలో ఇబ్బందులు ఉన్నట్టుగా పరిస్థితులు కనిపించలేదు. కానీ తాగునీరుకు మాత్రం ఇబ్బందులు పడుతున్నారని స్పష్టంగా తెలుస్తుంది. అదే విధంగా గతంలో ఉన్న 200 మంది పిల్లల సంఖ్య కన్నా ఇప్పుడు నలుగురే ఉండడానికి గల కారణాలు, అంటే అక్కడ సరైన భోజన వసతి లేకపొవడం కావచ్చు. అదేవిధంగా సెక్యూరిటీ పరంగా వాళ్లకి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ అనేది లేకపోవడమేనా అనేటువంటి విషయాలు తెలియాల్సి ఉంది. అదే విధంగా హాస్టల్ కి సంబంధించి కనీసం సీసీ కెమెరా కూడా లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వాళ్లకు ఏదైనా అత్యవసరమైతే హాస్టల్ నుంచి ఊర్లోకి వెళ్లాలంటే కటిక చీకటి కనీసం బయట రోడ్డు వరకు లైట్లు కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు మరి హాస్టల్ లో ఉండి చదువుకునే వాళ్లకి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే విధంగా వసతులు కల్పించాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్లకి ఏదైతే భోజనంకు సంబంధించినటువంటి మెనూ పూర్తిస్థాయిలో అందించే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు జరగాలి అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రెండు మూడు నెలలు కూడా మేము అక్కడికి వెళ్లి పరిశీలిస్తాం. ఆ పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పూర్తిస్థాయిలో ఇబ్బందులుగా ఉంటే మాత్రం వాళ్లకు అండగా నిలబడి వాళ్ల సమస్యలు అన్నిటికీ కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతాం అని తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో రహీం, శ్రీహరి, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.