అంబేద్కర్‌కు ఘన నివాళులర్పించిన అనంతసాగరం జనసేన

ఆత్మకూరు: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరియు అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహా బూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో అనంత సాగరం బద్వేలు రోడ్డు కూడలి నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. అంటరానితనం కుల వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న వివక్షను రానున్న తరాలు ఎదుర్కోకూడదని ఒక ఆశయంతో పరిస్థితులకు ఎదురీది ఉన్నత శిఖరాలను అధిరోహించి భారతావనికి రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహాపురుషుని స్మరిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తూ.. అందరికీ అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకు అందే విధంగా అందాలి అనే నినాదాన్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిజం చేస్తారని ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఎన్నో తరాలుగా మహనీయులు కులవివక్షను రూపు మార్చడానికి ఎంతో కృషి చేసిన ఇప్పటికీ మన మధ్యలో కులచిచ్చు రగిలిస్తూనే ఉన్నారు. ఆర్థిక అసమానతలతో ప్రజలు తల్లడిల్లుతూనే ఉన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కులాలకే పరిమితమైన రాజ్యాధికారాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే అన్ని వర్గాల వారికి అందే విధంగా చేస్తారని, జనసేన పార్టీ తరఫున ఒకసారి మద్దతు ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మండల కార్యదర్శి ఎం పెంచలయ్య, ప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.