బలహీన వర్గాలకు రక్షణ కల్పించినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి: మందపాటి దుర్గారావు

దాచేపల్లి: భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా దాచేపల్లి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంలో జనసేన పార్టీ దాచేపల్లి మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పించినప్పుడే అంబేద్కర్ కు మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. రాజ్యగాన్ని రక్షించాల్సిన ప్రభుత్వాలే పుంగనూరు నియోజకవర్గంలో రైతుల కోసం ప్రశ్నించిన రామచంద్ర యాదవ్ అనే బీసీ నాయకునిపై దాడి చేయడం అమానుషమని ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఈ ప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు లేదా…? అని ప్రశ్నించారు!. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే అంబేద్కర్ జయంతికి, వర్ధంతికి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయడం కాదని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ఫలాలు అందించడం. వారిని గౌరవించడం అని ఆయన తెలిపారు. ప్రజలందరు కూడా రాజ్యాంగ విధానాలతో ముందుకు వెళ్లినప్పుడే ఆ మహానుబావుడికి మనం అందించే నిజమైన నివాళి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి, తక్కెళ్లపాడు సర్పంచ్ లక్ష్మినారాయణ, మండల ఉపాధ్యక్షులు పాముల కిషోర్, ప్రధాన కార్యదర్శి కోట మధు, కార్యదర్శిలు బండ్ల రమేష్, గురజాల నర్సింహారావు, బూసి నాగేశ్వరావు, చిరంజీవి యువత అధ్యక్షులు వెచ్చలా రవి కుమార్, ఎస్టీ నాయకులు సోము నాయక్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.