వర్లకొండ సురేష్ పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి: జనసేన డిమాండ్

  • జనసేన పార్టీ ఎస్సీ నాయకుడు వర్లకొండ సురేష్ ను పరామర్శించిన జనసేన నాయకులు

పెనుకొండ నియోజకవర్గం, గోరంట్లలో అదికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ చేస్తున్న భూ ఆక్రమణల గురించి ప్రశ్నించినందుకు జనసేన జిల్లా కార్యదర్శి సురేష్, ఇతర జన సైనికులపై వైసీపీ ప్రభుత్వం కేసులు బనాయించి, వైసీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులచే వారిని కొట్టించి ఇబ్బంది పెట్టడం జరిగింది. బుధవారం ఉదయం తన పని నిమిత్తం రోడ్డుపై వెళ్తున్న సురేష్, ఆయన కుమారునిపై ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టీ.సీ.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, అబ్దుల్ నియోజకవర్గ ఇంచార్జ్ లు ఆకుల ఉమేష్, సాకే పవన్ కుమార్, జిల్లా కార్యదర్శిలు రాపా ధనుంజయ్, అవుకు విజయ్ కుమార్, పెనుగొండ నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి దాడిలో గాయపడిన సురేష్ ను, ఆయన కుమారుడిని, అక్రమ కేసులు బానాయించిన నాయకులని పరామర్శించి వారి కుటుంబాలకి మనోధైర్యం నింపడం జరిగింది. ఎవరైతే దాడి చేశారో వారిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి, వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.