2023 క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు తర్లుపాడు మండల సూరేపల్లి గ్రామ జనసైనికులు 2023 నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ కాశీనాధ్ పేరు మీద క్యాలెండర్లు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాలెండర్ ఆవిష్కరించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాధిక్, జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ ఇమామ్ సాహెబ్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు, జనసేన కార్యకర్తలు గుండెబొమ్ము శ్రీనివాసులు, యాదగిరి శివ, పిన్నెబోయిన శ్రీనివాసులు, పేరూరి రమేష్, కొండలు ప్రజాపతి, మట్టం శ్రీను, వెంకటేశ్వర్లు, షేక్ షరీఫ్, దుగ్గి రామిరెడ్డి, ఆది నారాయణ, బెల్లంకొండ రామకృష్ణ, లక్ష్మణ్ మరియు తర్లుపాడు మండలం సూరేపల్లి గ్రామ జన సైనికులు పాల్గొన్నారు.