వైయస్సార్ నగర్ లో మౌలిక వసతులు కల్పించమంటూ కలెక్టర్ కి అర్జీ ఇచ్చిన గునుకుల కిషోర్

నెల్లూరు: స్థానికుల అభ్యర్థుల మేరకు ఆదివారం వైయస్ నగర్ ను సందర్శించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సోమవారం సమస్యలను వివరిస్తూ జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ

  • పేద ప్రజలకు నివాసం నిమిత్తం ఇచ్చిన ఇళ్లు పది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు.
  • కనీస వసతుల కల్పన లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.
  • ఎనిమిది సంవత్సరాలుగా ఒకే ఎమ్మెల్యే ఉన్నాకూడా మౌలిక వసతులు సమకూర్చలేకపోయారు.
  • ప్రధాన సమస్యలైన మంచినీరు, రోడ్లు, పందులు, దోమలు, పాములు, కరెంటు లాంటి కనీస సౌకర్యాలు సమకూర్చడానికి సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది.
  • వెంటనే మౌలిక వస్తువులు పునరుద్దించాలని కలెక్టర్ ని కోరడం జరిగింది. కలెక్టర్ సానుకూలంగా స్పందించి కార్పొరేషన్ సిబ్బందిని పిలిచి ఇవన్నీ మన పరిధిలోని అంశాలే సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా తెలిపారు.
  • రానున్న పదిహేను రోజుల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకుంటే సరేసరి లేకపోతే స్థానికులతో కలిసి జనసేన పార్టీ తరఫున సమస్యలపై నిరసనలు ఉదృతం చేసి సమస్యలు పరిష్కరించేవరకూ తోడుగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు జనసేన పట్టణ కమిటీ కార్యదర్శి కృష్ణవేణి, స్థానిక వైఎస్ఆర్ నగర్ జనసేన నాయకులు కరీం, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర, అమీన్, మౌనిష్, అలేఖ్, షాజహాన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.