జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

  • హుకుంపేట జనసేన ఆద్వర్యంలో యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ
  • యువతలో రాజకీయ చైతన్యం నింపడానికే జనసేన ‘యువ శక్తి’
  • – యువ శక్తి విజయవంతానికి ప్రత్యేక కమిటీలు 

అల్లూరి సీతారామరాజు జిల్లా ఆరకువేలి నియోజకవర్గం హుకుంపేట మండలంలో జనసేనపార్టీ ఆత్మీయసమావేశం నిర్వహిండం జరిగింది. బలిజ కొటేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా డా.వంపురు గంగులయ్య పాల్గొని ఆరకు నియోజకవర్గం జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ.. జనవరి 12 వ తేదీన జరిగే యువశక్తి ప్రోగ్రాం జయప్రదం చేయాలని వారు కోరారు రణస్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని గిరిజన ప్రాంతం నుంచి భారీ ఎత్తున పాల్గొనాలని జనసైనికులను కోరారు. ఈ సమావేశాన్ని ఉద్దేశిస్తూ పోస్టర్ విడుదల చేసారు. కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నాయకులు సంపూర్ణాంగా సహాయ సహకారాన్ని అందించాలని కోరారు. ఆరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున పాల్గొని జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో బలిజ కొటేశ్వరావు మాదాల శ్రీరాములు, సుధీర్ కార్యనిర్వహణ కమిటీసభ్యులు సురేష్, సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా, రాంబాబు, అర్జున్, రాజభరత్, చందు, నాగరాజు, రామకృష్ణ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.