కూలిపోయిన స్కూలు ప్రదేశాన్ని పరిశీలించిన గునుకుల కిషోర్

జిల్లా పరిషత్ స్కూల్ కట్టుబడి ప్రాంతంలో నిర్మాణం కూలిపోయిందనే  విషయం తెలుసుకున్న జనసేన ప్రధాన కార్యదర్శి మరియు నాయకులు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఆ ప్రాంతానికి వెళ్లేసరికి ఉదయం కూలిన నిర్మాణం తాలూకు ఆనవాలు కనబడకుండా పూర్తిగా శుభ్రం చేసి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు.. ఆ ప్రాంతమంతా అసలు అక్కడ ఏమి జరగనట్లు వ్యవహరించారు. సొంత భవనాలను ఎంతో ఇంట్రెస్ట్ తో పెద్ద నిర్మాణ సంస్థలకి అప్పజెప్పి ఎంతో విలాసంగా కట్టుకుంటున్న వైసీపీ నాయకులు ప్రజాధనంతో పేదల పేద ప్రజల చదువుకు ఉపయోగపడే స్కూలును లోపం భూష్టంగా నిర్మాణించటం అన్యాయం అన్నారు. నిర్మాణంలో కూలీలు మరియు మేస్త్రిలు మాత్రమే ఉన్నారు కానీ నాణ్యతను పరిశీలించడానికి సూపర్వైజర్లు గాని మరే ఇతర నిర్మాణ సంస్థలు గాని అక్కడ లేకపోవడం పరిశీలిస్తే ఎంత నిర్లక్ష్యంగా వైసిపి నాయకులు ప్రవర్తిస్తున్నారని అర్థమవుతుందని తెలిపారు. స్కూల్ నిర్మాణం మొత్తం స్కూలు యాజమాన్యానికి అప్పజెప్పి చేతులు దులుపుకుంటున్న వైసీపీ నాయకులకి ఏమాత్రం జవాబుదారితనం లేదని తెలిపారు. అనంతరం స్కూల్ ఆవరణలో మూడు నెలలకే చిరిగిన జగనన్న కానుక స్కూల్ బ్యాగుల్ని పరిశీలించి ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయనేది తెలియజేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వైద్య విధానాన్ని నిర్వీర్యం చేస్తున్న తరుణంలో స్థానికంగా దాదాపుగా 900 మంది పైచిలుకు ఉన్న విద్యార్థుల కోసం నిర్మించబడుతున్న భవనం విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు ఈ వైసీపీ నాయకులని తెలిపారు. ఇప్పటికైనా నాయకులు మేలుకొని స్థానికంగా కట్టుబడి లోపం వల్ల కూలిపోయిన నిర్మాణం తాలూకు అవగాహన లోపాన్ని గమనించుకొని సరిదిద్దుకొని నాణ్యత పరిమాణాలను పరిశీలించి నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా కోరారు. రానున్న రోజుల్లో ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించవలసిన పాఠశాలను జవాబుదారీతనంతో వ్యవహరించి జాగ్రత్తగా నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, కంథర్, అమీన్, అలేఖ్, ఖలీల్, ప్రసన్న, మౌనేష్, ఇంతియాజ్, షాజహాన్, హేమంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.