ప్రభుత్వాలు ఉన్నది ప్రజలను ఆదుకోవడానికా లేక నట్టేట ముంచడానికా: గాదె

  • వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను పరామర్శించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

రేపల్లె: ఉమ్మడి గుంటూరు జిల్లా, రేపల్లె నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పొన్నపల్లి, కురప్పాలం, గుల్లపల్లి, ప్రసాదం వారి పాలెం, అరేపల్లి, తూరుపాలెం, ఇంకొల్లు, ఈదుపల్లి, తాడివాక వారి పాలెంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరామర్శించారు.. ఈ సందర్బంగా గాదె మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికా లేక నట్టేట ముంచడానికా వచ్చింది అని ప్రజలు తెలుసుకోవాలి. అధికార పార్టీ రాజ్యసభ సభ్యులు నిన్న వర్షాలకు పాడైన పంటలు దగ్గరకు వచ్చి రైతులను పరామర్శించడానికి వచ్చారంట.ఆయన ఇక్కడికి రావడానికి వర్షానికి పాడైన పంటల చూడటానికి మట్టితో, ఇసుకతో పొలాలపై దారి వేసుకొని వచ్చారంట. ప్రజల అర్థం చేసుకోండి అకాల వర్షాల వల్ల పాడైన పొలాల్లోకి రావడానికి కూడా వీళ్లు ఇష్టపడటం లేదు. సరే ఏదో వచ్చారు వైసీపీ పార్టీ నాయకులు ఇక్కడ జరిగిన నష్టాన్ని చూసి రైతులకు భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంటే.. ఏదో వచ్చి తు..తూ మంత్రంగా రైతులను పరామర్శించి వెళ్లిపోయారే గాని వారికి తక్షణ సాయం కూడా ప్రకటించలేని స్థితిలో వైసీపీ పార్టీ ఉంది అంటే ఎంతటి సిగ్గుచేటో ప్రజలు గమనించాలని గాదె అన్నారు. ఈ కార్యకరంలో గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు అడపా మణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, మత్తి భాస్కరరావు, చందోలు ప్రసాద్, మేకల రామయ్య యాదవ్, జిల్లా సంయుక్త కార్యదర్శిరాసము శెట్టి మహేష్ రేపల్లె పట్టణ అధ్యక్షులుగోపరాజు ఉదయ్, కృష్ణ, పుషడుపు శివరామకృష్ణ, గూడపాటి శ్రీనివాసరావు, అందే సాంబశివరావు, నెల్లూరి రాజేష్, కొలగాని రవికుమార్, మత్తి సుధాకర్, తాతాపోలేరయ్య, మత్తి షేక్ బాషా, సనక విజయ్ కుమార్, ఉప్పలపాటి సాగర్, జాకీర్ హుస్సేన్, షేక్ బాజీ, వి నాగబాబు, మొగిలి పువ్వు నాగేశ్వరరావు, కొమ్మూరి శ్రీనివాసరావు, సుబ్బారావు, పటాన్ బాబుల్ల, మర్రిపూడి డైసన్, నాగిశెట్టి సంపత్, రాంబాబు, జల్లి కార్తీక్, లింగినేని పవన్ కళ్యాణ్, లింగినేని సురేంద్ర, మతి యానాదిరావు, రేపల్లి శ్రీనివాసరావు, కారుమూరి పెద్ద మంగయ్య, మండే ప్రసాద్, కమతం నాగేశ్వరరావు పాల్గొన్నారు.