సర్వేపల్లి జనసేన ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ళు పేదలకు కన్నీళ్లు

సర్వేపల్లి: మనుబోలు మండలం, అక్కంపేట కాలనీ నందు పేదలకు ఇచ్చిన ఇళ్ల ప్లాట్లను జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటి వరకూ పేదలకి కనీసం 20 నుంచి 30 శాతం ఇళ్ళు నిర్మించిన దాఖలాలు లేవు, అదికార పార్టీ నాయకులకు అనుకూలమైన వారికి, వారి పార్టీ కార్యకర్తలకి తప్ప పూర్తిస్థాయిలో ఇల్లు లేని పేదలకి అందించినటువంటి దాఖలాలు లేవు, అదేవిధంగా అక్కంపేట కాలనీలో చూస్తే హై టెన్షన్ వైర్ల కింద ఇళ్ల స్థలాలు వేసిన పరిస్థితి నెలకొన్నది, ఎవరైనా హై టెన్షన్ వైర్లు కింద ప్లాట్లు వేస్తారా మరీ ఇంత దౌర్భాగ్యమా, ఈ ప్రభుత్వం పేదలకి పూర్తిస్థాయిలో ఇళ్ళు నిర్మించి ఇచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా అంటే ఎక్కడా అటువంటి ఆలోచన కూడా లేనట్టుగా ఉంది, ఇక్కడ చూస్తే ఈ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పేదలకు నిర్మించి ఇస్తానన్న ఇళ్ల గురించి ఎక్కడా ప్రస్తావన జరిపిన పరిస్థితి లేదు.. పొద్దున లేస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ చోక్కా వేసుకున్నాడు, ఏ కళ్ళజోడు పెట్టుకున్నాడు, ఆయన రథానికి ఏం పేరు పెట్టుకున్నాడు, ఆయనకి ఎన్ని పెళ్లిళ్లు అయినాయి అనే చెత్త వాగుడుల తప్ప కనీసం పేదవాడి సొంత ఇంటి కల కూడా నెరవేర్చే పరిస్థితిలో లేని దౌర్భాగ్యపు పరిపాలన ఈ రాష్త్రంలో నెలకొంది. దౌర్భాగ్యంగా తయారైన ప్రజా నాయకులము అని చెప్పుకునే అధికార పార్టీ నాయకులారా ఇకనైనా మారండి, ప్రజల గురించి ఒక క్షణం ఆలోచించండి అని బొబ్బేపల్లి సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, శ్రీహరి, రహమాన్, విష్ణు సార్లు, సారీ, తదితరులు పాల్గొన్నారు.