వ్యవసాయ శాఖ ఏడిఏ కి అవనిగడ్డ జనసేన వినతి పత్రం

మాండూస్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులకు ఉపశమనం కలిగించే విధంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోకపోవడంతో అవనిగడ్డ మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ శాఖ ఏడిఏ కి పలు డిమాండ్ల తో కూడిన వినతి పత్రం ను సమర్పించారు.
1) తక్షణమే మినుము, పెసలు లాంటి రబీ విత్తనాలు ఉచితంగా ప్రభుత్వమే సరఫరా చేయాలి.
2) తేమ శాతం 17 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాలి.
3) నష్ట పోయిన రైతులకు తక్షణ పరిహారం కింద ఒక ఎకరానికి 25,000 ఇవ్వాలి.
4) హమాలీ, రవాణా చార్జీలు రెట్టింపు చేయాలి.
5) రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లాంటి డిమాండ్లతో వినతిపత్రం ఇచ్చారు.
స్థానిక తహసీల్దారుకి కూడా వినతిపత్రం ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ విషయంలో రైతులు ఎన్ని విధాలుగా నష్టపోయిన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదంటే స్థానిక శాసనసభ్యులు చోద్యం చూస్తున్నారా అని నిలదీశారు. తక్షణం మినుములు లాంటి విత్తనాలు సరఫరా చేయకపోతే రైతుల పక్షాన జనసేన పార్టీ పోరాటం చేస్తుందని నేతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మండల పార్టీ ఉపాధ్యక్షులు తుంగల నరేష్, బొప్పన పృథ్వి, ప్రధాన కార్యదర్శి యక్కటి నాగరాజు, గుగ్గిలం అనీల్, యక్కటి రంగనాథ్, బచ్చు ప్రశాంత్, గంగు రామానంద వరప్రసాద్, అర్జున్, రేపల్లె రోహిత్, అప్పికట్ల శ్రీ భాస్కర్, బ్రహ్మం, రాజనాల వీరబాబు, బాలు, బాబా ప్రసాద్, ప్రసాద్, నాగబాబు, చంద్రశేఖర్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.