తుంగలవారిపాలెం గ్రామంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక రైతులతో కలిసి జాతీయ రైతు దినోత్సవ వేడుకలు జరుపుకున్న అవనిగడ్డ జనసైనికులు. స్థానిక రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి, వ్యవసాయం లో ఇప్పుడు వచ్చే నష్టాలు, ప్రభుత్వం సహాయం చేయక పోవడం, సబ్సిడీ మీద విత్తనాలు, ఎరువులు సరఫరా జరగక పోవడం తదితర విషయాలు గురించి తెలుసుకోవడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి, ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ అధికారం లోకి వస్తే 60 సంవత్సరాలు పైబడిన రైతులకు నెలకు 5,000 రూపాయలు పెన్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందని, ఏరువాక సమయంలోనే రైతుకు ఎకరానికి 8000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లు రైతులకు చెప్పడం జరిగింది. మద్యం రేట్లు, ఆర్టీసీ చార్జీలు, విద్యుత్ చార్జీలు, ఇసుక రేటు, ఎరువుల ధరలు ఇలా అన్ని రేట్లు పెంచే ప్రభుత్వం ధాన్యం రేటు మాత్రం తగ్గించడం బాధగా ఉందని రైతులు జనసేన నాయకుల ముందు తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు. అనంతరం గ్రామంలోని 5గురు రైతులను శాలువాతో సత్కరించి స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి గాజుల శంకరరావు, మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, యక్కటి నాగరాజు, గంగు రామానంద వరప్రసాద్, చుండూరు రమేష్, గుడివాక రామాంజనేయులు, భోగిరెడ్డి బాలాజీ, తుంగల బాల భాస్కర్, గంగు అర్జున్, తుంగల ఆంజనేయులు, తుంగల వేణు, బ్రహ్మం, గరికిపాటి అంజి, ఫరీద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.