అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు ఉత్తమ సేవా అవార్డ్

  • ఉత్తమ సేవలకు, ఉత్తమ వైద్య శిబిరాల నిర్వహణకు అవార్డ్ పొందిన అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

విజయనగరం: వాకర్స్ ఇంటర్నేషనల్ 2022వ సంవత్సరంనకు, 31వ వార్షికోత్సవ వేడుకల సమావేశం వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు నేతాజీ సుబ్బారెడ్డి నెల్లూరులో డిసెంబర్24, 25వ తేదీలలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలకు అవార్డుల వేడుకల్లో భాగంగా శనివారం డిస్ట్రిక్ట్-102 పరిధిలో ఉన్న అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ కు ఉత్తమ సేవలకు, అత్యధిక వైద్య శిబిరాల నిర్వహణకు ఉత్తమ అవార్డులను క్లబ్ వ్యవస్థాపకధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), క్లబ్ కార్యదర్శి రవిరాజ్ చౌదరి, వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు నేతాజీ సుబ్బారెడ్డి చేతులు మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పూర్తితో వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పంతో, అందరికీ ఆరోగ్యం పట్లశ్రద్ధ వహించేటట్లు చేయాలనే ఉద్దేశ్యంతో వాకర్స్ క్లబ్ ను పెట్టామని, ఇదే స్ఫూర్తితో మరెన్నో సేవలతో ముందుకెళ్తామని, అలాగే మెగాభిమానులతో మరెన్ని వాకర్స్ క్లబ్బులు విస్తరించేటట్లు చేస్తామని తెలిపారు. వాకర్స్ క్లబ్ సేవలకు స్ఫూర్తి ప్రదాతలైన అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు కు, చందక రామదాసు, వాకర్స్ క్లబ్ ఉద్యమకారులు డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాస్టారు కు,ఎ.తిరుపతిరావు కు, డిస్ట్రిక్ట్-202 గవర్నర్ పి.జీ.గుప్తా, రీజనల్ కౌన్సిలర్ జీ.కృష్ణంరాజు, నాలుగేస్సల రాజు, సుబ్బరాజు, లకు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డ్ పొందినందుకు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెగా అభిమానుల రాష్ట్ర నాయకులు, జనసేన నాయకులు, శ్రేయోభలాషులు క్లబ్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.