సద్దికూళ్లపల్లి ప్రాధమిక పాఠశాలను సందర్శించిన డా. యుగంధర్ పొన్న

శిదిలావస్థకు చేరుకున్న సద్దికూళ్లపల్లి ప్రాధమిక పాఠశాలను జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కనిపించకపోవడం బాధాకరం. ఇద్దరు విద్యార్థులతో కొనసాగుతున్న పాఠశాల, ఇలాగే కొనసాగితే పాఠశాల మూత పడాల్సిందే, జనవరి 2వ తేదీ నుండి ఎక్కువ పిల్లులు వచ్చే అవకాశఉన్నది, క్రమంగా స్కూలుకు వస్తున్న ఉపాధ్యాయులు రవికుమార్ అప్పుడప్పుడు డెప్యూటేషన్ పై వేరే పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. శిదిలావస్థకు చేరుకున్న రెండు భవనాలను కూల్చి కొత్తది కట్టాల్సిందేనని, కార్వేటి నగరం ఎం.ఈ.ఓ ను అదనపు బాధ్యతల నుండి తీసివేయాలని, వెదురు కుప్పం మండలానికి రెగ్యులర్ విద్యాధికారిని నియమించి, పర్యవేక్షణ పెంచాలని, విద్యా పరిరక్షణ పెరగాలని, విద్యను విస్మరించడానికి లేదని, విద్యా హక్కు చట్టం సంపూర్ణంగా నెరవేర్చబడాలి అని, ఒక మంత్రి, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లోనే ఇంచార్జ్ ల పాలన సాగుతుందంటే, మిగతా సాధారణ నియోజకవర్గంలో పాలన ఎలా ఉందొ దీనిని బట్టి అవగత మవుతోందని వెదురు కుప్పం మండలంలో ప్రతీ డిపార్ట్మెంట్ లో రెగ్యులర్ అధికారులు నియమించాలని యుగంధర్ పొన్న డిమాండ్ చేసారు.