మంత్రి బొత్సా గారూ.. మా పాఠశాలను అభివృద్ధి చేయండి: గుడ్లురు జనసేన

నెల్లూరుజిల్లా, కందుకూరి నియోజక వర్గం, గుడ్లురు మండలానికి గతంలో 6నుండి 10వ తరగతి వరకూ చదివే విద్యార్దులకు విద్యాలయంగా ఉంటూ ఎందరో విద్యార్థులను ఉన్నత శికరాలకు తీసు కెళ్ళిన పాఠశాల గుడ్లురు జెడ్.పి హైస్కూల్ అని గుడ్లురు జనసేన పార్టీ మండల కన్వినర్‌ అన్నింగి చలపతి అన్నారు. ఈ పాఠశాల భవనం పురాతనమైనది కావడంతో వర్షాకాలంలో వర్షం కురవడంతో ఉపాద్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ అదికార పార్టీ వై.సీ.పీ ప్రభుత్వం గతంలో విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ విద్యాశాఖకకు వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పటం దారుణం అని, అది కారంలోకి వచ్చి మూడు సంవత్సరాలవుతున్నా మంత్రులు మారినప్పటికి పాఠశాల అభివృద్ధి జరుగలేదని, గుడ్లూరు మండల జనసేన నాయకుడు తామస్ అన్నారు. గడప గడపకూ తిరుగుతున్న అధికార పార్టీ నాయకులు సంక్షేమ పథకాలను వివరించి చెప్పటం హాస్యా స్పదంగా ఉందని మండల నాయకుడు సాయి అన్నారు. అదే విధంగా మండల స్థాయి విద్యాశాఖ అధికారాలు నిర్లక్షం విద్యార్థాలకు శాపంగా మారిందని, ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాలకు హైస్కూల్ ప్రహారి గోడ పడిపోయి దాదాపుగా నెలరోజులు గడిచినా గోడకు మరమత్తులు చేయక పోవటం దారుణం. ఈ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్ధుల ఆర్థిక సహాయంతో సరస్వతి దేవి అమ్మవారు, ఎర్రా ప్రగడ విగ్రహాల ఏర్పటు, మంచినీటి సరఫరా సౌకర్యం ఏర్పటును జనసేన తరువున హృదయ పూర్వక అభినందనలు తెలియ జేసారు, ఇకనైనా విద్యాశాఖ మంత్రులూ, అదికారులు పాఠశాల నిర్మాణానికి సహకరించి, పిల్లల భవిషత్తు, జీవ నాదారం విద్య తోనే ముడి పడి ఉందనే విషయాన్ని పత్రి ఒక్కరూ గమనించాలని జనసేన మండల అధ్యక్షుడు అన్నింగి చలపతి డిమాండ్ చేసారు.