గాలిలో పేక మేడ ఈ వైసీపీ ప్రభుత్వం: గునుకుల కిషోర్

  • పేకాటంటే మొన్న జిల్లాలో పట్టుబడిన వైసిపి నాయకులు గురించి మాత్రం కాదు
  • పండు టాకులపై పించను కక్ష సాధిస్తున్న జగన్.. వయోవృద్దుల శోఖం మంచిది కాదు
  • ఢూ ఢూ బసవన్న సంక్రాంతి వచ్చినట్లు ఎన్నికలు వస్తున్నాయంటే కొంత మంది నాయకులు నిద్రలేస్తారు.. నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికే ఇదంతా అంటున్నారు ప్రజలు

వైసీపీ అనుసరిస్తున్న రాజకీయ విధానాలపై జనసేన పార్టీ గునుకుల కిషోర్ మంగళవారం సాయంత్రం నెల్లూరు సిటీ సుబేదారు పేట, అనురాధ స్పోర్ట్స్ జంక్షన్ వద్ద గల ఆయన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గాలిలో పేక మేడలు కడుతున్న ఈ వైసీపీ ప్రభుత్వం త్వరలో కూలనుంది. పేకాటంటే జిల్లాలో ఈ మధ్య ఇటీవల కాలంలో పట్టుబడిన వైసీపీ సీనియర్ నాయకుల గురించి మాత్రం కాదు నిజం. ఒక ప్రణాళిక లేని వైసిపి ప్రభుత్వం ఎప్పుడూ తలకిందుల అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. పండుటాకుల వంటి వయవృద్ధులకు పింఛన్లు ఏరువేసి దుఃఖానికి గురి చేస్తున్నారు జగన్. నామమాత్రంగా 250 రూపాయలు పెంచి దాదాపుగా సిటీ పరిధిలో 5000 రూరల్ సిటీలో 3000 [8 వేలమంది]కి పెన్షన్లు కట్ చేయడం దారుణం. దానికి షరతులు అయితే మరీ విడ్డూరంగా ఉన్నాయి. 1000గజాల స్థలం ఉంటే.. 300 యూనిట్లు పైబడి కరెంటు వస్తే.. 100 సిసి కి మించి మోటార్ వాహనం ఉంటే కారు ఇలా అనేక షరతులతో పెన్షన్లు ఏరువేత సరైన పద్ధతి కాదు. 1000 గజాలు కూడా స్థలం ఉండకుండా కటిక పేదరికం లో ప్రజలుండాలని జగన్ కోరుకుంటున్నట్లున్నారు. ఈ రోజుల్లో టీవీ ఏసీలు లేని ఇల్లు ఉండవు ఒక టీవీ ట్యూబ్ లైటు రెండు ఫ్యాన్లు వేసుకున్న కూడా 300 యూనిట్లు కరెంటు కాలుతుంది. భార్య భర్తుల్లో ఇద్దరు ఒకరు ఉద్యోగస్తుడైతే, ఐటీ ఉంటే అని ఎన్నో ఆంక్షలు విధించి సంక్షేమ పధకాలు ఏరువేరువేత సరైన పద్దతి కాదు. నిర్దిష్ట ప్రణాళిక లోపం తో ఆదాయ వనరులు లేకపోవడమే ఈ ఏరివేతకు కారణమని తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు సరైన సమయానికి ఇవ్వలేకున్నారు. ఇక సంక్రాంతి వస్తుంది ఢూ ఢూ బసవన్నలు వచ్చినట్లు ఎన్నికల రానున్నాయని కుల నాయకులు నిద్రలేచారు. ఆ బసవన్నలకూ నాలుగు రాళ్లు లేని వేసుకుందామనుకున్న కొంత మంది కుల నాయకులు ఏమాత్రం తేడా లేదు.ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కులాల పేర్లతో విడదీసి రెచ్చగొట్టి మనకివి కావాలి.. అవి కావాలని.. ర్యాలీలు ధర్నాలు నిరసనలు చేసి అకస్మాత్తుగా కనుమరుగైపోవడం మామూలే.. ప్రజారాజ్యం సమయం నుంచి చూస్తున్నాము. కులాల పేరుతో ప్రజలను వేరుచేసి భ్రమలో ముంచేత్తి ఫలానా నాయకులను వారి కుటుంబాలను గెలిపించేందుకు కుల నాయకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో గెలిస్తే 5% రిజర్వేషన్ ఇస్తాను అనే మాయమాటలు చెప్పిన జగన్ కి వత్తాసు పలికిన మా కుల నాయకులు మూడు సంవత్సరాలు కనబడకుండా పోయి ఈరోజు ఎలక్షన్లు మూడున్నర సంవత్సరం తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి ఈ హామీలిస్తే మేము ఓటేపిస్తామని చెప్పి మరోసారి బూటక ప్రమాణాలు ఇప్పించి ప్రజలను మోసం చేసే పరిస్థితి కనపడుతుంది. వీరంతా కూడా ఏ కులానికి కూడా ప్రతినిధులు కాదు ఎందుకంటే వారు ఆపదలో ఉన్న సమయంలో ఎవరూ వారిని ఆదుకోలేదు కాపులకి ఇస్తానన్న 5% రిజర్వేషన్ ఇవ్వనప్పుడు గానీ, వారి బిడ్డలకు విదేశీయానానికి అవసరమైన ఋణాలు కల్పనలో గాని కాపులకు అందవలసిన నిధులు వేరే దారులు మళ్ళించేటప్పుడు గానీ మీరు చోద్యం చూస్తూనే ఉన్నారు కానీ ఒరగబెట్టిందేమీ. ప్రస్తుత వైసిపి రాజకీయ విధానం మయసభను తలపిస్తుందని… అన్నీ ఉన్నట్లున్నాయి కానీ ఏమీ లేనట్లే ఉందని. రాష్ట్ర అభివృద్ధి రాజధాని లేక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకీ అందరికీ అందాలన్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాల్సిందేనని. రానున్నది జనసేన ప్రభుత్వమే.. ప్రజలందరూ గాజుగ్లాసు కు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు ప్రశాంత్ గౌడ్, కంథర్, హేమచంద్ర, షాజహాన్, ఇంతియాజ్, ఉమాదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.