నీతి అంటే అవినీతికి భయం.. పవన్ అంటే జగన్ కు భయం: చొప్పా చంద్ర శేఖర్

అనంతపురము జనసేన జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వైసీపీ పార్టీ నాయకులకు ఎందుకంత భయం అంటే మన పెద్దలు చెప్పిన విధంగా నీతి అంటే అవినీతికి భయం అవినీతికి తాత్కాలిక విజయం వస్తుందేమో కానీ అంతిమ విజయం మాత్రం నీతిదే అనే విషయం మన పెద్దలు మనకు తెలిపారు. అందుకే నీతివంతమైన జనసేన పార్టీ అధినాయకుడిని చూడగానే అవినీతిపరులైన నాయకులకు గుండెల్లో దడ పుడుతుంది. ఎందుకంటే ఒకసారి నీతివంతమైన నాయకుడికి అవకాశం వస్తే అవినీతిపరులకు జీవితంలో రాజ్యాధికారం అందదు అందుకే వారికి భయం పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిపై కుట్రలు. కుతంత్రాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు దత్త పుత్రుడు అంటూ కొంతమంది చెత్త పుత్రులు వాగుతూ పవన్ కళ్యాణ్ గారిపై కుటుంబవ్యక్తుల ను తూలనాడుచున్నారు.. జనసేన పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వమంటూ ఒక పార్టీ అధినాయకుడు ప్రజా సమస్యలపై ప్రజల మధ్యకు వస్తే వారి కార్యకర్తలకు అభివాదం చేయకూడదని లైట్లు ఆర్పి వేసి కార్యకర్తలను చెల్లాచెదరు చేయాలని ఒక పార్టీ అధినాయకుడు ఒక ప్రచార రత్నాన్ని తెచ్చుకుంటే దానిని రోడ్లపై తిరగనివ్వము అంటూ ఒక పార్టీ అధినాయకుడు ఒక టీవీ ప్రోగ్రాం కి వెళితే అది ఏదో చేయకూడని పని చేస్తున్నట్టు ఈ కంత్రి మంత్రులు మతిస్థిమితం లేని మాటలతో ప్రజలను ఏ మార్చాలని చూస్తున్నారు అసలు వారు ప్రజలకు చేయవలసిన పనులు మానేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే వారి పనిగా పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు రాజ్యాధికారం రాని కులాలకు రాజ్యాధికారం రావాలని.. ఈ దోపిడీ వ్యవస్థల నుండి ప్రజలను కాపాడాలని… అవినీతి పార్టీల రాజకీయ పాలన నుంచి ప్రజలను కాపాడి నీతివంతమైన పాలన అందించటానికి జనసేన పార్టీని స్థాపించాడు కాబట్టి వారికి పవన్ కళ్యాణ్ గారు అంటే భయం వారి కుట్రలకు అంతే లేదు.. ఇక 30 సంవత్సరములు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే అని ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత నాకు మాత్రమే ఉందని ఒకరు వారి నియంత పోకడలతో ప్రజలను ఇంతకాలం మోసపుచ్చుతూ వస్తున్నారు. ఈ రాష్ట్రం వారి అబ్బ సొత్తు అన్నట్టుగా.. ఇతర కులాల కు పాలించే అర్హత లేదనేవిదంగా వ్యవహరిస్తున్నారు. మన రాజ్యాంగాన్ని ఆ మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించి దేశంలోని పౌరులకు కొన్ని హక్కులు కల్పించారు కాబట్టే సరిపోయింది, లేకుంటే ఈ అవినీతిపరులు దగుల్బాజీలు సామాన్యులను ఇంటి నుండి బయటకు రావడానికి కూడా ఆంక్షలు పెట్టేవారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక టీవీ ప్రోగ్రాం కి వెళితే దానిపై అపోహలు కుట్రలు చేస్తూ ఆయనను కించపరిచే విధంగా తోలనాడుతున్నారు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని గతంలో విమర్శించారు కాబట్టి అతని ప్రోగ్రాంకు వెళ్ళకూడదని ఒక సర్వోత్తమ మహిళ శిరోమణి పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి రోజా గారు ప్యాకేజీ అని పలుకుతుంటే ఆమె కొన్ని సంవత్సరములుగా అనేక టీవీ ప్రోగ్రాములు చేస్తూ ఏ ఏ పార్టీల ద్వారా ఎన్ని సూట్ కేసులు ప్యాకేజీలు తీసుకుందో ప్రజలకు తెలపాలి.. గతంలో టిడిపి పార్టీలో ఉన్నప్పుడు ఈ డ్రైనేజీ రోజా గారు వైయస్సార్ గారి పై అనేక తిట్ల వర్షాలు కురిపించారు, ఇపుడు అతని తనయుడు జగన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళటానికి ఎన్ని కోట్ల ప్యాకేజీ ఈ రోజమ్మ తీసుకుందో ప్రజలకు తెలపాలి అసలు ఈ తప్పుడు కూతల రోజమ్మను చూసి మహిళా లోకం తలదించుకుంటోంది.. ఇలాంటి పనికి మాలినపనులు చేస్తూ ప్రజల మధ్య మేము దళితులమా బయట ఉంచారు అంటూ.. ఆర్థికంగా వెనుకబడిన సామాన్యులపై వీరి అహంకార భావం తెలుపుతూ.. కనీసం చట్ట సభలలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియక అసెంబ్లీలోనే రేపు చేస్తారేమో రండి అని కారు కూతలు కూసే ఈ ఈమె జనసేన పార్టీ అధినాయకుడిని విమర్శిస్తే ఈమెను చూస్తే మన రాష్ట్ర మహిళా లోకం తలదించుకుంటుంది సిగ్గు ఎగ్గు లేని పనులు చేస్తూ జనసేన పార్టీని విమర్శిస్తుందా అని మన రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు .. వీరు నాలుగు సంవత్సరముల పాలనలో కనీసం ఒక్క హాస్పటల్ అయినా నిర్మించారా..? ఒక్క స్కూల్ అయినా నిర్మించారా..? ఒక్క రోడ్డు అయినా వేశారా..? పక్క రాష్ట్రం వారు నీటి ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు అసెంబ్లీ నిర్మించుకున్నారు. హాస్పిటల్ నిర్మిస్తున్నారు.. వారిని చూసైనా వీరు సిగ్గు తెచ్చుకుంటే మంచిది మన రాష్టంలో క్విడ్ ప్రోకో విధానాలతో కార్పొరేషన్ల డబ్బును ఇతర పథకాలకు పంచుతూ అన్ని సామాజిక వర్గాలకు చెందిన యువత కు అన్యాయం చేశారు.. కనీసం అవ్వ తాతలకు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మన అవినీతి పాలన సాగుతోంది అవ్వ తాతలకు ₹250 పెంచినప్పుడల్లా ఒక రెండు లక్షల మందికి వృద్ధాప్య పెన్షన్లు తీసివేయడం జరుగుతుంది అంతే 50 ఇళ్లకు ఒక వాలంటీర్నీ పెట్టి మరి వృద్ధులలో అనర్హులంటూ వివిధ కారణాలు చూపిస్తూ నాలుగైదు మీటర్లు ఉన్నాయంటూ కార్లు ఉన్నాయంటూ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందంటూ చౌకబారు కారణాలతో అవ్వదాతలకు మోసం చేస్తున్నారు మరి అర్హత ఉంటే తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు అనే ఈ తెలివితక్కువ పాలవకులకు అసలు పెన్షన్ జాబితాలో తొలగించేటప్పుడే వారి అర్హతను వాలంటీర్ల ద్వారా పరిశీలించుకోవచ్చు కదా పాలన చేతగాక పవన్ కళ్యాణ్ గారిని తిడితే ప్రజలు మిమ్ములను క్షమించరు ఇలాంటి విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు వీరికి అధికారం భవిష్యత్తులో దక్కదన్న భయంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారు మీ అరాచక పాలనకు అంతిమ సమయం ఆసన్నమైంది మన రాష్ట్ర ప్రజలు మీకు తొందరలోనే తగిన గుణపాఠం చెబుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ భవిష్యత్తు జనసేన పార్టీ అని తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే నీతివంతమైన పాలన రావాలంటే పవన్ అన్న ముఖ్యమంత్రి కావాలని నిర్ణయం తీసుకున్నారని చంద్ర శేఖర్ అన్నారు.