జనసేన ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యశిబిరం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు జిల్లా ప్రదానకేంద్రమైన పాడేరు లో గల జనసేనపార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పాడేరు అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య సౌజన్యంతో, అనిల్ నీరుకొండ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్బంగా వైద్యశిభిరం నిర్వహించడానికి కృషిచేసిన డా. గంగులయ్య మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలలో ఒకటైన వైద్య సదుపాయాలు అంశంపై జనసేన పార్టీ గిరిజన ప్రజారోగ్యంపై దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, సుదూర ప్రాంతాల్లో నుంచి కూడా పేషెంట్లు వచ్చారన్నారు. ముక్యంగా రక్తహీనత, అర్ధోపెడిక్ సమస్య, పక్షవాతం, పోషకాహార లేమి వంటి సమస్యలతో బాదపడుతున్న వారు వచ్చి ప్రాథమిక చికిత్స తీసుకున్నారు. మేము సేవాదృక్పదంతో నిర్వహించిన వైద్యశిబిరానికి ప్రజాస్పందన బాగుందని గిరిజన ప్రజల్లో కూడా ఆరోగ్య స్పృహ వచ్చిందని, అలాగే అనిల్ నీరుకొండ హాస్పిటల్ డాక్టర్స్ తో ప్రత్యేకంగా మన ప్రాంతంలో ఆగని శిశు మరణాలు అంశాన్ని తెలియజేసి జిల్లా కేంద్రంలో వైద్యశిభిరం ఏర్పాటు చేసాం. అలాగే ప్రతి నెలకి ఒకసారి చొప్పున ప్రతి మండల కేంద్రంలో ఇకపై వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తామని, గిరిజనప్రజలు ఈ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. అడిగిన వెంటనే మా అభ్యర్థన మన్నించి ఈ వైద్యశిభిరం ఏర్పాటు చేసిన అనిల్ నీరుకొండ హాస్పిటల్ వైద్యులు మరియు యాజమాన్యానికి వారికి ప్రత్యేక మా గిరిజన ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ వైద్యశిభిరం కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు,అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య, వీరమహిళ కిటలంగి పద్మ, దివ్యలత, కమల్ హాసన్, సురేష్ కుమార్ మధు, అశోక్, సత్యనారాయణ, ఈశ్వర్ నాయుడు, అశోక్ కుమార్, సంతోష్, జి.మాడుగుల మండల అధ్యక్షులు భీమన్న మసాడి, గొంది మురళి, మస్తాన్, ఈశ్వరరావు, ఖుషి, సింహాచలం మసాడి, రాజు, తదితరులు పాల్గొన్నారు.