అందరి ఇంటా సంతోషాలు వెదజల్లాలి: ఆకుల రామకృష్ణ

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెం కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని రాష్ట్ర కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ ఆకాంక్షించారు. 2023 జనవరి 1న నూతన సంవత్సర వేడుక సందర్భంగా ఆదివారం గోపాలపురంలో ఆయన స్వగృహం వద్ద ఆయన అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి, నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు, కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలనుండి అధికసంఖ్యలో, ఆకుల రామకృష్ణ అభిమానులు, కార్యకర్తలు గోపాలపురం చేరుకోవడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. బిజెపి, కాంగ్రెస్, వైయస్సార్ సిపి, టిడిపి, జనసేన, సిపిఎం, సిపిఐ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు, పలువురు ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, చిన్నారులు, గ్రామస్తులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలతో, దుస్సాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కారుటూరి నరసింహారావు, చిలువూరి సతీష్ రాజు, గుత్తులు పట్టాభిరామారావు, పొనుగుపాటి శ్రీనివాస్,కొవ్వూరి సీతారామిరెడ్డి, గోనెమడతల కనకరాజు, అధికారి నాగేశ్వరరావు, సాధనాల శ్రీనివాస్, నందం వీర వెంకట సత్యనారాయణ, యర్రంశెట్టి నాగేశ్వరరావు(బుజ్జి), మానే గోవిందు, కర్రి అశోక్ రెడ్డి, పెచ్చెటి చిన్నారావు, గండ్రోతు సత్తిబాబు, మిరియాల రాము, తోట నాగరాజు, జవ్వాది రవిబాబు, పడాల నాగ మహేశ్వర రెడ్డి,మెర్ల రాము, గోవింద్ కృష్ణారెడ్డి,బండారు బాబీ, తోట స్వామి,గుర్రాల నాగభూషణం, ఒదురీ శివ, మయిగాపుల గురయ్యనాయుడు, ఆకుల శివ, కుంచె శ్రీను, బండారు శ్రీను తదితరులు పాల్గొన్నారు.