మాచర్ల రామకృష్ణ (ఆర్.కె)ను సన్మానించిన విజయవాడ హెల్పింగ్ హాండ్స్

విజయవాడ హెల్పింగ్ హాండ్స్ వార్షికోత్సవ సందర్భంగా మానవసేవే మాధవ సేవ అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసైనికులని సత్కరించి ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (ఆర్.కె) మాట్లాడుతూ నేను నువ్వు మనం కలిస్తేనే సమాజం సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే మహనీయుల స్ఫూర్తితో సమాజ హితమే నా అభిమతంగా మార్చుకుని గుడివాడ పట్టణంలో మానవసేవే మాధవసేవ అని నినాదంతో పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మా టీమ్ ని ప్రోత్సహించి ఉత్తమ సేవా పురస్కార్ అవార్డు అందజేసిన హెల్పింగ్ హాండ్స్ వారికి మరియు పోలీసు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలియజేశారు. మనిషి జన్మ పరిపూర్ణత అవ్వాలంటే సమాజానికి దేశానికి పనిచేయడమే నిజమైన మనిషి జన్మని దయచేసి మానవత్వాన్ని బతికించండి అని తెలియజేశారు.