నిషేధ ఆంక్షలు, జీవోలతో యువశక్తిని ఆపలేరు: గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు, నయవంచుకుల చేతిలో దగాపడిన ఉత్తరాంధ్ర యువకులు గొంతుకను ప్రపంచానికి వినిపించేందుకే జనసేన “యువశక్తి” కార్యక్రమాన్ని తలపెట్టామని దీనిని ఆంక్షలతో ఆపాలని చూస్తే.. స్థానిక యువత బెబ్బులిలా గర్జించి విశాఖ సముద్రంలో కలుపుతారని ప్రభుత్వానికి హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో యువకులకు అలివిగాని హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేసారని, అక్కడి యువత ఉపాదిలేక ఇతర రాష్ట్రాలకు తరలిపోయి కూలి పనిచేసే దుస్థితికి ముఖ్యమంత్రి తీసుకోచ్చాడని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను నిట్టనిలువునా జగన్మోహన్ రెడ్డి ముంచారని, చదువుకున్న యువతకు ఉపాధి కరువై పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని ముఖ్యమంత్రి ఆరాచకత్వంతో ప్రపంచ స్థాయి సంస్ధలు ఆంధ్రప్రదేశ్ నుండి పారిపోతే కొన్నింటిని దెగ్గరుండి మరి తరిమారని జిల్లా అధ్యక్షుడు గాదె ఘాటుగా విమర్శించారు. సకల శాఖ మంత్రి మాట్లాడుతూ బహిరంగ సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదు అంటు మాట్లాడుతున్నారని, ఆంక్షలు, జీవోలు ప్రతిపక్షాలకు మాత్రమే అని.. అధికార పార్టీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఎటువంటి అడ్డంకులు లేవని మీ సభలకు ముసలి మూతకను తరలించి వాళ్ళ కాళ్ళు విరిగిన కూడా సభలు నిర్వహిస్తారని, జనసేన సభలలో ఎక్కడ కూడా ఒక్క అపశృతి గాని సంఘటన జరగకున్న అనుమతులు ఇవ్వకుండా ఆంక్షలు పెట్టడం నియంత పాలనకు నిదర్శనమని గాదె ధ్వజమెత్తారు. రణస్థలంలో జరగనున్న యువశక్తి పోస్టర్ ను రిలీజ్ చేశారు. యువశక్తి కార్యక్రమాన్ని ఎన్ని శక్తులు అడ్డుకున్నా చేసి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాయుబ్ కమాల్, జిల్లా నాయకులు నారదాసు ప్రసాద్, మేకల రామయ్య యాదవ్, అప్పారావు శ్రీరాములు, సుబ్బారావు కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మ, దాసరి లక్ష్మిలు పాల్గొన్నారు.