వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చీకటి జి. ఓ నెంబర్ 1 రద్దుచేయాలి: పంతం నానాజీ

కాకినాడ రూరల్, కేడి నెంబర్ వన్ ప్రవేశపెట్టిన జీవో నెంబర్ వన్ ను రద్దు చేయాలని ,జనసేన ఈ జిఓను పరిగణనలోకి తీసుకోవడం లేదని జనసేన పిఏసి సభ్యులు పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసైనికులు కాకినాడ రూరల్ గుడారి గుంటలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈనెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనకు సంబంధించి వారాహి వాహనాన్ని రోడ్ ఎక్కకుండా చేయడంలో భాగంగానే బ్రిటిష్ కాలంనాటి 1861 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తూ తీసుకొచ్చిన జీవో ఈ కుట్రలో భాగమే అన్నారు. వారాహిను ఎవరూ అడ్డుకోలేరు అని నానాజీ అన్నారు. జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యమైన యువత భవిష్యత్తుకు నూతన వెలుగులు ప్రకాశింపజేసేందుకు స్వామి వివేకానంద స్ఫూర్తితో జనసేనని పవన్ కళ్యాణ్ యువశక్తి కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నారని తెలిపారు. మంత్రి పినిపే విశ్వరూప్ వైసిపికి కార్యకర్తల అవసరం లేదని వాలంటీర్లు ఉంటే చాలు అని అన్నారు. ఇప్పటికైనా వైసిపి కార్యకర్తలు బుద్ది తెచ్చుకుని ఆ పార్టీ నుండి బయటకు రావాలి అని పంతం నానాజీ అన్నారు. యువశక్తి కార్యక్రమం అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఫలితం ఉండదని కేడి నెంబర్ వన్ వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోని జనసేన పార్టీ పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. యువశక్తి కార్యక్రమం నిర్వాహకు సంబంధించి కాకినాడ రూరల్ నుండి అధిక సంఖ్యలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం చేరేందుకు జనసైనికులు సంసిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యువశక్తి పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్, కరప మండలం అధ్యక్షలు, నియోజకవర్గం నాయకులు, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.