నిహారిక సంగీత్ వేడుక.. ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేసిన మెగా ఫ్యామిలీ

మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక కోసం మెగా ఫ్యామిలీ సభ్యులు చిరంజీవి, సురేఖ, నాగాబాబు, పద్మజ, అల్లు అరవింద్ దంపతులు, రామ్ చరణ్ ,ఉపాసన, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, బాబీ ఫ్యామిలీ, శిరీష్‌, చైతన్య ఫ్యామిలీ అంతా సోమవారం రాజస్థాన్ చేరుకున్నారు. ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్టు తెలుస్తుంది.

సోమవారం రాత్రి సంగీత్ వేడుక నిర్వహించగా ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ సభ్యులు అంతా ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేశారు. పిల్లలు రామ్ చరణ్ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేశారు. మహిళలు కూడా చిందులేశారు. వీరి సందడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇక రాజస్థాన్‌లోని హోటల్‌లో దిగిన వెంటనే నిహారిక, చైతూలకి అక్కడి బ్యాండ్ మేళం బృందం ఘన స్వాగతం పలకగా, జోష్‌లో ఉన్న నిహరిక..చైతన్యతో కలిసి చిందులేసింది. ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.