శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు, నిధులు స్వాహా – పట్టించుకోని దేవాదాయ శాఖ మంత్రి మరియు అధికారులు..!

గుడ్లూరు, మండల కేంద్రమైన గుడ్లూరు పురాతన కాలంలో నేత్రపురిగా పిలువబడింది. అందుకు కారణం గుడ్లూరులో నూటొక్క బావులు, నూటొక్క గుడులు అంతకంటే ఎక్కువగా ఉండటం వలన గుడులు ఊరు – గుడ్లూరు గా రూపాంతరం చెందింది. అన్నంగి చలపతి మాట్లాడుతూ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం మరియు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అతి పురాతనమైనవి. మహాభారతంను రచించిన కవులలో ఒకరైన ఎర్ర ప్రగడ శ్రీ నీలకంఠేశ్వర స్వామి సమక్షంలో తాను రచించిన శేష కావ్యంలో కొంతభాగం ఇచ్చట రచించారని ప్రసిద్ధి. గత ముప్పై ఐదు సంవత్సరాలకు పూర్వం ప్రతి ఏటా శివరాత్రి నాడు ప్రభలు కట్టి చుట్టు ప్రక్కల ప్రజలందరితో కలిసి తిరుణాళ్లను అత్యంత వైభవంగా జరిపించేవారు. ఈ దేవాలయానికి సంబంధించి 50 ఎకరాలు దేవుని మాన్యం ఉంది. అయినా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. శివాలయం శిథిలావస్థకు చేరుకుంది. పూర్వ వైభవాన్ని కోల్పోతున్న దశలో కొంతమంది కమిటీలుగా ఏర్పడి 33 లక్షల విరాళాలు 2016 వ సంవత్సరంలో సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పోతుల రామారావుకి ఈ విషయం తెలియజేశారు. అప్పటి దేవదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ మాజీ దేవదయ శాఖ మంత్రి గారిని పిలచి గ్రామ కమిటీ వసూలు చేసిన 33 లక్షల రూపాయలను దేవాలయాల పునర్నిర్మాణాల కోసం వెల్లంపల్లికి ఇవ్వడం జరిగింది. అయితే వాళ్లు డబ్బులు పట్టుకుపోయారే గాని అభివృద్ధికి నోచుకోలేదు. వర్షాకాలంలో ఆలయమంతా వర్షపు నీటిమడుగులు ఉంటుంది. ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దేవాలయాల పునర్నిర్మాణాలను చేపట్టాలని మా మండల ప్రజలందరి మనవి అని మాట్లాడారు అదేవిధంగా భీమవరం జనసేన నాయకులు ఆలూరి ప్రతాప్ మాట్లాడుతూ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానమునకు 30 ఎకరములు దేవుడి మాన్యం ఉంది. మన్యం అయితే ఉంది కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు. ప్రస్తుతం విష్ణు ఆలయం గుడి శిథిలావస్థకు చేరి వర్షాకాల సమయంలో వర్షపు నీరు కారుతూ భక్తులకు ఇబ్బందిగా ఉన్నది. పునర్నిర్మాణం చేయకపోయినా కనీసం మరమ్మతులు కూడా చేయలేదని చేయట్లేదని సంబంధిత అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. కొలకలూరి ఆమోస్ గారు మాట్లాడుతూ పురాతన చరిత్ర కలిగి ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధికి నోచుకోని ప్రభుత్వం దేవదాయ శాఖ మంత్రి మరియు అధికారులు ఎందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి నోచుకోని ఈ ప్రభుత్వాన్ని రాబోవు రోజుల్లో రాష్ట్ర ప్రజానీకం అనగతొక్కుతుందని హెచ్చరించారు. ఇకనైనా దేవదాయ మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులు దేవాలయాల పునర్నిర్మాణాల కోసం కృషి చేయాలని గుడ్లూరు మండల ప్రజానీకం కోరుకుంటుందని తెలిపారు.