చెత్త సమస్యను పరిష్కరించాలి: చిమట రవివర్మ

గన్నవరంలో శివాలయం రోడ్డు పక్కన ఉన్న చెత్త ప్రాంతాన్ని సోమవారం జనసేన పార్టీ కృష్ణాజిల్లా జాయింట్ సెక్రెటరీ చిమట రవివర్మ సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరం గ్రామం ఎంతో చారిత్రాత్మకమైన గ్రామం.. పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఉక్కుకాకాని వెంకటరత్నం గారు వంటి మహానుభావులు ప్రాతినిధ్యం వహించినట్టి గ్రామం అని, మా గన్నవరంలో అన్ని సౌకర్యాలు కలవు, నిత్యం లక్షలామంది కదలాడే ప్రాంతం ఎంతో చరిత్ర ఉన్న మా గన్నవరంలో అనాదిగా చెత్త సమస్య వెంటాడుతూనే ఉందని ప్రజలు చెబుతున్నారని అన్నారు. అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇన్ని సంవత్సరాలు గడిచిన చెత్త సమస్యను సరైన పరిష్కారం చూపలేకపోవడం అత్యంత శోచనయమని, గన్నవరం పంచాయితీ వారు ఇళ్ల నుంచి సేకరించిన చెత్తని గ్రామ శివారు శివాలయం గన్నవరం ఆగిరిపల్లి రోడ్డు మార్గాన పక్కనే రోడ్డుకి చివర వేయడం వల్ల వాటి నుంచి వస్తున్న దుర్వాసన, సూక్ష్మ క్రిములు వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారని, రోడ్డు చివర చెత్తను తగలబెడటం వల్ల దాని నుండి వచ్చే పొగ వలన ప్రజలు శ్వాస కోసం ఇబ్బందులతో మరియు రకరకాల అనారోగ్య సమస్యలకు లోనవుతున్నారని రవివర్మ అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం గన్నవరం పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య గారు చూపాలని, అలాగే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు అని, ప్రజలు వంశీ గారిని ఎన్నుకుంటే ఆయన మన గన్నవరాన్ని చెత్త మయం చేశారని ఎద్దేవా చేశారు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గన్నవరంలో రోడ్డు మార్గాన ఉన్న ఈ చెత్తను క్లీన్ చేసి వెంటనే దూర ప్రాంతాల్లో దీని సరైన స్థలం కేటాయించి గన్నవరం నియోజవర్గానికి ఒక డంపింగ్ యార్డ్ ని నిర్మించవలసిందిగా జనసేన పార్టీ తరఫున చిమట రవివర్మ డిమాండ్ చేశారు, ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే జనసేన పార్టీ ఏ ఉద్యమానికైనా వెనకాడబోమని, శాశ్వత పరిష్కారం అయ్యేంతవరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని రవివర్మ అన్నారు.. ఈ కార్యక్రమంలో గన్నవరం మండల అధ్యక్షుడు పచ్చిపాల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొలవెన్న నాని, కార్యవర్గ సభ్యులు దారువా రోశయ్య, మెట్లపల్లి రంగారావు, షేక్ సిరాజ్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.