ఘనంగా అనుశ్రీ జన్మదిన వేడుకలు

రాజమండ్రి సిటీ: రాజమండ్రి జనసేన పార్టీ (అనుశ్రీ ఫాలోవర్స్) ఆధ్వర్యంలో రాజమండ్రి అర్బన్ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆనంద రెసిడెన్సి పందిరి ఫంక్షన్ హాల్ నందు రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనుశ్రీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ మేడ గురుదత్త ప్రసాద్, పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తుమ్మల బాబు, అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ పరుపుల తమ్మయ్య బాబు, జిల్లా అధికార ప్రతినిధి నారాయణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి, జిల్లా సంయుక్త కార్యదర్శులు వై.వి.డి ప్రసాద్, గెడ్డం నాగరాజు, రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుశ్రీ జన్మదినోత్సవాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ఇతర నియోజకవర్గ ఇంచార్జ్ లు అనుశ్రీని ప్రశంసించారు. పలువురు సినీ డిస్ట్రిబ్యూటర్స్ వింటేజ్ ప్రసాద్, కరణ్ సి రాజు. వింటేజ్ క్రియేషన్స్ శివరాం, సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ లక్ష్మణరావు, మూర్తి, కుమారి థియేటర్ చిన్ని, సూర్య కాంప్లెక్స్ పెద్ద బాబు, ఇంటెక్స్ క్రియేషన్స్ మేనేజర్ ప్రసాద్, బ్రహ్మాజీ, జగన్, అనుశ్రీ ఫిలిమ్స్ మేనేజర్ హరిబాబు, అమలాపురం థియేటర్ ప్రొప్రైటర్ సత్తిబాబు విచ్చేసి అనుశ్రీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో అభిమానులు, కార్యకర్తలు అనుశ్రీ నీ గజమాలలతో, బుకీలు, కేక్ కటింగ్, ద్వారా అనుశ్రీ కీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 500 మంది జనసేన వీరమహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం అనుశ్రీ చేతుల మీదగా నిర్వహించారు. అనంతరం విందు ఏర్పాట్లు చేశారు. రాకింగ్ బాయ్స్ డాన్స్ స్కూల్ వార్చే డాన్స్ కార్యక్రమం జరిగింది. పలుచోట్ల రక్తదాన కార్యక్రమంలు, అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ వేడుకల్లో రాజమండ్రి నగర ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి లు వెంకట పైడ్రాజు, నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శిలు అల్లాటి రాజు, విన్న వాసు, అలివేలు మంగతాయారు, శాలిని, అసూరి సుధాకర్, గున్నం శ్యాంసుందర్, సంయుక్త కార్యదర్శి లు కెల్లా జయలక్ష్మి, దేవికి వాడ చక్రపాణి, కురంఅప్పారావు, చైతన్య కుమార్, పొట్నూరి శ్రీనివాస్ ( ఠాగూర్), రాజమండ్రి నగర నాయకులు మొండేటి ప్రసాద్, మట్టపర్తి నాగరాజు, బయ్యపు నీడి సూర్య మిత్ర బృందం, మంచాల సునీల్, పొన్నడా శ్రీను, చిన్నారి, సియాద్రిరాజు, ఖన్నా, నర్సిపూడి రాంబాబు, ఖాను, రాంబాబు, ఏ.డి ప్రసాద్, విక్టరీ వాసు, వెంకటేశు, బసరమణి ప్రసాద్, ఆటో రాజు, కుంది రాము, రాఘవ, కడియం వీరబాబు, పిన్నిటి విజయ్, సియాద్రి రాజు, హేమదుర్గ, ప్రవీణ్, ప్రసాద్, ధర్మ రాజు, మణికంఠ, వంశీ, నంగిన శ్రీను, పళ్ళశీను, నాయుడు, సురేష్, సూర్య, పలువురు అభిమానులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.