విశ్వం వాయిస్ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి సిటీ: విశ్వం వాయిస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను జనసేన రాజమండ్రి సిటీ ఇంచార్జీ అనుశ్రీ సత్యనారాయణ శనివారం ఆవిష్కరించారు. సాయికృష్ణ థియేటర్ ఆఫీసులో విశ్వం వాయిస్ రిపోర్టర్ రత్న కిషోర్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వం వాయిస్ యాజమాన్యానికి జిల్లా స్టాఫ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో నిజాలు అనర్గళంగా చేరవేయడంలో పత్రికలు ముందుందాలి అని పాఠకులకు, ప్రజలకు, అధికారులకు, నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు, రాజమండ్రి నగర వైస్ ప్రెసిడెంట్ గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శులు అల్లాటి రాజు, విన్న వాసు, అక్కిరెడ్డి ప్రసాద్, జనసైనికుడు అవినాష్ తదితరులు పాల్గొన్నారు.