జనసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీ కార్యక్రమం

కొండెపి: ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో, సంక్రాంతి సందర్భంగా మహిళలకు ఎంతో ఘనంగా ముగ్గుల పోటీ కార్యక్రమం మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమం శనివారం స్థానిక రైల్వే రోడ్డులోని రంగ రంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సుమారు వందకు పైగా మహిళలు పోటీల్లో పాల్గొన్ని బహుమతులు గెలుచుకున్నారు. మొదటి బహుమతి విజేత ఎస్ స్వప్న, రెండవ బహుమతి విజేత డి అనిత, మూడవ బహుమతి విజేత కె హరిత విజేతలుగా నిలవగా.. మొదటి 20 విజేతలకు చీరలు బహుమతులుగా ఇవ్వడం జరిగినది. అంతేకాక ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళలకు బహుమతి జనసేన పార్టీ తరుపున అందించినారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీమతి రాయపాటి అరుణ, శ్రీమతి పరింగి కీర్తన, ప్రకాశం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, దర్శి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బొట్టుకు రమేష్, ప్రకాశం జిల్లా జనసేన కార్యదర్శి కళ్యాణ్ ముత్యాలు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాయిని రమేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోవింద కోమలి, ఒంగోలు నగర జనసేన సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఆకుపాటి ఉష, నగరపాలక మహిళ శ్రీమతి సుంకర కళ్యాణి, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నలూరు మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, కొండేపి మండల అధ్యక్షులు ఎల్లమరిద్దినీ విశ్వ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ముఖ్య పాత్ర వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమానికి మొదటి బహుమతి 5,116/- దాత జనసేన నాయకులు దండే ఆంజనేయులు, రెండవ బహుమతి 3,116/- దాత కొత్తపల్లి శ్రీ హర్ష, మూడవ బహుమతి 2116/- కించెం శెట్టి రవిబాబు సహకారంతో అందజేయడం జరిగింది.
ఈ ముగ్గుల పోటీలో మొదటి 20 విజేతలకు చీరలు బహుమతులు అందజేసిన దాతలు సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, గణేష్, కొత్తపల్లి శ్రీహర్ష, జనసేన నాయకులు సయ్యద్ చాన్ బాషా, చలువాది వెంకట సుబ్బారావు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు ఇచ్చిన దాతలు కాసుల శ్రీనివాస్, కాసుల శ్రీకాంత్, శీలం సాయి, పోనుగోటి డేవిడ్. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల జనసేన నాయకులు జనసైనికులు మరియు వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.