అభిమాని బిడ్డ పెళ్లికి ‘చిరు’ సాయం

మెగాస్టార్ చిరంజీవికి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  వెండితెరకు పదేళ్ల గ్యాప్ ఇచ్చినా కూడా బాక్సాఫీస్ స్టామినా కొంచెం కూడా తగ్గలేదు. ఇక ప్రకృతి విపత్తులు వచ్చినా, అభిమానులకు సహాయం. కావాలన్నా కూడా విరాళాలు అంధించేందుకు ముందుగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఒక అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిసి సహాయం అంధించారు. కూతురి పెళ్లి కోసం మెగాస్టార్ కూడా తనవంతు సహాయం చేశారు.

మహబూబాబాద్ కు చెందిన బోనగిరి శేఖర్ గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. మిర్చి బండితో జీవనాన్ని సాగిస్తూ ఉండే అతను రాష్ట్రస్థాయి చిరంజీవి సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాడు. అయితే శేఖర్ కీ ఇద్దరు కూతుళ్ళు వర్ష, నిఖిత. అయితే పెద్దమ్మయు పెళ్లికి డబ్బు అవసరం పడడంతో స్వయంగా చిరంజీవి తెలుసుకొని 1,00,000/- ఆర్ధిక సాయం చేశారు. డిసెంబర్ 19న జరిగే పెళ్లి జరగనుంది. ఇక స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ మెగాస్టార్ చిరంజీవి గారు అందించిన లక్ష రూపాయల సహాయం గురించి మీడియాకు తెలియజేశారు.

అభిమానులు ఎవరూ కష్టాల్లో ఉన్న మాకు చెప్పండి అని చిరంజీవి గారే స్వయంగా మాతో చెప్పినట్టు మెగా ఫ్యాన్స్ లీడర్ స్వామి నాయుడు వివరణ ఇచ్చారు. సహాయం అందుకున్న చిరంజీవి అభిమాని శేఖర్ బావోద్వేగంతో.. రక్త సంబంధీకులు చేయని సహాయం చిరు గారూ చేసారు ఏమిచ్చినా ఈ రుణం తీర్చుకోలేనిది అని కన్నీరు పెట్టుకున్నాడు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు, సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కె. ప్రభాకర్ గౌడ్ అభిమానికి చెక్ అందించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.