ఘనంగా డా.శ్రీధర్ పిల్లా జన్మదిన వేడుకలు

పిఠాపురం, పిఠాపురం జనసేన నాయకులు మరియు శ్రీవిష్ణు హాస్పిటల్ అధినేత డా.శ్రీధర్ పిల్లా జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.శ్రీధర్ పిల్లా పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. డా.శ్రీధర్ పిల్లా జన్మదిన వేడుకలలో భాగంగా జనసేన నాయకులు మరియు జనసైనికుల మద్య కేక్ కట్ చేయడం జరిగింది. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం పాఠశాలలోని విద్యార్ధులకు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.