నేచురల్ స్టార్ నూతన చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ ప్రారంభం

నేచురల్ స్టార్ నాని హీరోగా క్రియేటివ్ జీనియస్ రాహుల్ సాంకృత్యాన్ (‘టాక్సీవాలా’ ఫేమ్‌) డైరెక్ట్ చేస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్‌. బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాని తను ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రలో కనిపించబోతున్నాడు.

నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి (‘ఉప్పెన’ ఫేమ్‌) నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ (‘ప్రేమమ్’ ఫేమ్‌), రాహుల్ రవీంద్రన్‌, మురళీ శర్మ, అభినవ్‌ గోమటం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా… నాని, సాయిపల్లవి, కృతి శెట్టిలపై ముహూర్తపు సన్నివేశాన్ని తీశారు. నాని తండ్రి గంటా రాంబాబు క్లాప్ నివ్వగా, డైరెక్టర్ మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్చాన్ చేశారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్లు శివ నిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్టును దర్శక నిర్మాతలకు అందజేశారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి సత్యదేవ్ జంగా కథను సమకూర్చగా, మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్ మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. సను జాన్ వర్ఘీస్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ నెలలోనే ‘శ్యామ్ సింగ రాయ్’ రెగ్యులర్ షూటింగ్ మొదలవనున్నది.