విడివాడ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో మండపాక జనసేన ఆఫీసు నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మండపాక గ్రామం సర్పంచ్ జానా వెంకటలక్ష్మి మరియు మండపాక గ్రామం వైస్ ప్రెసిడెంట్ శివ నాగ ప్రసాద్, (నగేష్) తణుకు టౌన్ ప్రెసిడెంట్ కొమిరెడ్డి శ్రీనివాస్, తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, పంతం నానాజీ, జానా శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.