బూర్జ గ్రామంలో ఇంటింటికి జనసేన క్యాలెండర్ ల పంపిణీ
ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, బూర్జ గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు పిలుపుతో బూర్జ మండల నాయకులు మజ్జి రాంబాబు, తోట అప్పలరాజు ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన క్యాలెండర్ లను ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేత సాయికుమార్, అనుసూరి మన్మధరావు, బూర్జ గ్రామం నాయకులు, గ్రామస్తులందరూ చాలా హుషారుగా పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-27-at-7.13.29-PM-1024x768.jpeg)