ఎస్టి, ఎస్సి సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించి నవరత్నాలకు సర్దుతున్నారు: డా.వంపూరు గంగులయ్య

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం జి.ముంచంగిపుట్టు పంచాయితి కావురాయి గ్రామంను జనసేనపార్టీ నాయకులు సందర్శించారు గ్రామ పెద్దలు సీదారి సన్నిబాబు, కొర్ర రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా అరకు పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య మరియు పాడేరు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య గ్రామస్తులనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతాల్లో కూడా పాలన సక్రమంగా జరగట్లేదు. ఎస్టి, ఎస్సి సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించి నవరత్నాలకు సర్దుతున్నారు. సుస్థిర పాలనపై సరైన అవగాహన లేని నేర స్వభావం గల నాయకులను ఎన్నుకుంటే మనకు తగిన శాస్తి జరిగింది. యావత్తు గిరిజన జాతిపై చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తుంటే మన ప్రజా ప్రతినిధులు కిమ్మనకుండా బానిసత్వం ప్రదర్శిస్తుంటే సాటి గిరిజనుడిగా సిగ్గు పడుతున్నాం ఒక వైపు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు గిరిజన సహజాసంపద ధారాదత్తం చేస్తుంటే మన ప్రతినిధులు ఎంపీ, ఎంఎల్ఏ లు చోధ్యం చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. గిరిజన ప్రజలు నేటికీ సరైన రహదారి వ్యవస్థ లేదు, రైతు గిట్టుబాటు ధర సంగతి దేవుడెరుగు, సుస్థి చేస్తే ఆస్పత్రులకి చేరుకోవాలంటే 108 కాదు డోలి మోత కొత్త రకం వాహనాలను అందుబాటులో తెచ్చారు ప్రభుత్వం, జీవో నెం 3 ని కాలరాసి గిరిజన యువతకి ద్రోహం చేయడానికి పరోక్షంగా తోడ్పడ్డారు. అన్ని రకాలుగా విపలమయ్యింది ప్రభుత్వం మన ప్రజా ప్రతినిధులు ప్రజా పాలన కంటే వారి వ్యక్తిగత విసయాలపైన శ్రద్ధ పెడుతున్నారు. ఇకపై ప్రజలు ఆలోచించాలని నిజాయితీగా పనిచేసే పవన్ కళ్యాణ్ ని ఆదరించి ఆంధ్రప్రదేశ్ బాగుకోరుకునేవారవుదామని చెప్పారు. గిరిజన నాయకులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా గిరిజన యువతకు నా సందేశం ఏమిటంటే వ్యక్తుల్ని నాశనం చేసే రాజకీయాలు ఉండవచ్చు అది కేవలం వైసీపీ రాజనీతి, కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచి అరాచక పాలనకు మారుపేరు వైసీపీ ప్రభుత్వమని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు సీదారి సన్నిబాబు, కొర్ర రాంబాబు, జనసేనపార్టీ మండల నాయకులు మాదేలి నాగేశ్వరరావు, మజ్జి నాగేష్, మసాడి కళ్యాణ్, అంకిత్, అశోక్, మధు, సంతోష్, అశోక్ కుమార్, రమేష్ నాదెలా, కృపరాజ్, కిరణ్, గ్రామపెద్దలు యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.