జీవో 1 రద్దు చేయాలి.. వామపక్షాల నిరసన కార్యక్రమంలో రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ర్యాలీ సభా స్వాతంత్రాలను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం ఏలూరులోని గాంధీ మైదానంలో వామపక్షాల నాయకులతో కలిసి నిరశన కార్యక్రమంలో రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు.. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రజా ప్రజాస్వామ్యాన్ని, ప్రజా వర్గాన్ని, మేధావి వర్గాన్ని, ప్రతిపక్షాల గొంతును నొక్కాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకువచ్చిన జీవో నెం.1ని రద్దు చేయాలని, మరి మహాత్మా గాంధీ గారు తనకు మంచి బుద్ధిని ప్రసాదించాలని, ఇక్కడ అఖిలపక్షంతో ఆందోళన చేస్తున్నప్పటికీ.. ఒక దున్న పోతు మీద వర్షం పడ్డట్టుగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు గానీ.. ప్రజల యొక్క శ్రేయస్సు గానీ ప్రజా సంఘాల యొక్క శ్రేయస్సును గాని ప్రజలకు స్వేచ్ఛనిచ్చే పరిస్థితి గానీ రాజ్యాంగ హక్కులను హరించే విధంగా ఈ జీవో నెం.1ని తీసుకొచ్చారు. ఇప్పటికైనా కోర్టు మొట్టకాల వేస్తున్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇది కాని పక్షంలో అఖిలపక్షంతో కలిసి ఉధృతమైన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, కుర్మా సరళ, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు నిమ్మల శ్రీనివాసరావు, రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, వీరంకి పండు, అధత్ర సురేష్, బుధ్ధా నాగేశ్వరరావు, వేముల బాలు వీర మహిళలు కోలా సుజాత, జొన్నలగడ్డ సుజాత, తుమ్మపాల ఉమాదుర్గ, ప్రియా రాణి, దుర్గా బి తదితరులు పాల్గొన్నారు.