ఘనంగా కలెక్టర్ హిమాన్షు పుట్టినరోజు వేడుకలు

  • కలెక్టర్ హిమాన్షు పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన మోటూరి దంపతుల

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పుట్టినరోజు సందర్భంగా చిందాడగరువు ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు అయినవిల్లి విఘ్నేశ్వర స్వామికి కలెక్టర్ పేరు మీద పూజలు చేయించి స్వామివారి సన్నిధిలో కలెక్టర్ కు బొకే ఇచ్చి సాలువా కప్పి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో మానసిక విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి బిస్కెట్స్, చాక్లెట్స్ పంచి, కలెక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అమలాపురం పట్నంలో 100 మందికి అనాధలకు, వృద్ధులకు, బిక్షగాళ్లకు, స్వామీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయం ఈవో సత్యనారాయణ రాజు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.