గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం..

గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతులు సంతోష్‌(25), మనోహర్‌(22), భరద్వాజ్‌(20), మాదాపుర్‌ అయ్యప్ప సొసైటీకి చెందినవారుగా గుర్తించారు.