కొయ్యాన లక్షుమమ్మకి పింఛన్ అందజేత

  • 85 సంవత్సరాల లక్షుమమ్మకి జనసేన అండ
  • కొయ్యాన లక్షుమమ్మకి కొణిదెల పవన్ కళ్యాణ్ సౌజన్యంతో దామోదరం సంజీవయ్య వృద్ధాప్య భరోసా గా పింఛన్ అందజేత

విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం కర్లాం గ్రామానికి చెందిన 85 సంవత్సరాల కొయ్యాన లక్షుమమ్మకి గడిచిన మూడు సంవత్సరాలు నుండి పింఛన్ రావడం లేదు. ఆమెకు ఆధార్ కార్డ్ లేదని, ఐ-రేస్ కూడా అవ్వడం లేదని చెప్పి వైస్సార్సీపీ ప్రభుత్వం పింఛన్ తొలిగించడం జరిగింది. అప్పుడు నుంచి ఆ కుటుంబం అటు ప్రభుత్వ కార్యాలయాల మెట్లు, ఇటు రాజకీయ నాయకుల గడపలు తొక్కని రోజంటూ లేదు. ఈ విషయం మెల్లగా స్థానిక జనసైనికుల దృష్టికిరాగా.. విషయాన్ని పార్టీ పెద్దల దగ్గారకు తీసుకొని వెళ్లడం, పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పడం స్వల్ప వ్యవధిలో జరిగింది. ఆమెకు ప్రభుత్వం నుండి పింఛన్ వచ్చేలా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కొణిదెల పవన్ కళ్యాణ్ సౌజన్యంతో దామోదరం సంజీవయ్య వృద్ధాప్య భరోసా క్రింద పింఛన్ వచ్చే వరకు ఆమెకు ప్రతి నెల 2000 రూపాయిలు ఇస్తామని చీపురుపల్లి మండల అధ్యక్షులు విసినిగిరి శ్రీనివాసరావు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. అందులో భాగంగా ఫిబ్రవరి నెల పింఛనును ఆమెకు అందించారు. ఈ కార్యక్రమంలో లక్షము నాయుడు, శ్రీను, శంకర్, ఆదినారాయణ, సింహాచలం, ఈశ్వరరావు, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.