కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ముగిసింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడురోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బయలుదేరారు. రాష్ట్రంలో చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. ఇందులో భాగంగా నిన్న ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తక్షణ వరద సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సాయం అందించాలని విజ్ఞప్తిచేశారు. నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు ఇవ్వాలని, నిధులు మంజూరుచేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

అంతకుముందు పర్యటన లో భాగంగా ఆయన పౌర విమానయాన శాఖ, పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి హార్దప్ సింగ్ పురితో భేటి అయ్యారు. సిద్దిపేట సహా ఆరు విమానాశ్రయాల ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. శుక్రవారం కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం హోంమంత్రి